SSC : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షల షెడ్యూల్ విడుదల

-

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షల షెడ్యూల్ కాసేపటి క్రితమే విడుదలైంది. కరోనా నియమ నిబంధనలను దృష్టిలో పెట్టుకొని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షల షెడ్యూల్ను విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ పరీక్షల వివరాల్లోకి వెళితే…


1. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్ 2019 సంబంధించి రాతపరీక్ష పూర్తయినప్పటికీ… కరోనా కారణంగా స్కిల్ టెస్ట్ వాయిదా పడింది. ఇప్పుడు కరోనా ఆంక్షలు ఎత్తివేయడంతో దేశ వ్యాప్తంగా సెప్టెంబర్ 15 మరియు 16 తేదీలలో ఈ పరీక్ష జరగనుంది.
2. జూనియర్ ఇంజనీర్ ఎగ్జామినేషన్ 2020 (పేపర్-2) ను సెప్టెంబర్ 26వ తేదీన దేశ వ్యాప్తంగా నిర్వహించనున్నారు.
3. మల్టీటాస్కింగ్ స్టాఫ్ ఎగ్జామినేషన్ 2020 (పేపర్ 1) : అక్టోబర్ 5 నుంచి అక్టోబర్ 20వ తేదీ మధ్య ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.
4. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి ఇ మరియు గ్రేడ్ డి ఎగ్జామినేషన్ 2019 (స్కిల్ టెస్ట్) : అక్టోబర్ 21 మరియు అక్టోబర్ 22 ఈ రెండు రోజుల పాటు నిర్వహిస్తారు.
ఇక కరోనా నియమ నిబంధనలను దృష్టిలో ఉంచుకుని… అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news