వివాదాస్పద పౌరసత్వ చట్టం సిఏఏ ని కేంద్రం సోమవారం అమల్లోకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడు సీఎం స్టాలిన్ ముఖ్యం మంగళవారం కీలక ప్రకటనను చేశారు. ప్రభుత్వం తమిళ నాడులో సిఏఏ చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అమల్లోకి తీసుకురాదన్నారు. పౌరసత్వ చట్టం పార్లమెంటులో ఆమోదం పొందిన నాలుగు సంవత్సరాల తర్వాత లోక్సభ ఎన్నికలకు ముందు మోడీ దీనిని అమల్లోకి తీసుకువచ్చారు.
ఇలా చేయడం ద్వారా ప్రధాని రాజకీయ ప్రయోజనాలు పొందచ్చని అన్నారు. దీని వల్ల భారత ప్రజల మధ్య విభాగాలు సృష్టిస్తున్నారు. సీఏఎ వల్ల ఎలాంటి ఉపయోగం లేదా ప్రయోజనాలు ఉండవు. పూర్తిగా ఇది అసమంజసమైనది దాని నిబంధనలు భారత రాజ్యాంగం పునాది నిర్మాణానికి విరుద్ధంగా ఉన్నాయన్నారు.