ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ గా జై స్వాల్

-

టెస్ట్ క్రికెట్ లో రికార్డులు బద్దలు కొడుతున్న భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఐసీసీ అవార్డు రేసులో నిలిచాడు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదు టెస్టుల్లో రెండు డబుల్ సెంచరీ బాదిన జైశ్వాల్ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డుకు పోటీ పడి ఫిబ్రవరి నెలకుగాను ఈ యువ బ్యాటర్ ఎంపిక అయ్యాడు.

తాజాగా ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్‌’గా టీమ్ ఇండియా యంగ్ క్రికెటర్ యశస్వీ జైస్వాల్ నిలిచారు. ఫిబ్రవరి నెల ప్రదర్శనకు గానూ ఆయనకు ఈ అవార్డు లభించింది. న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ కేన్ విలియమ్సన్, శ్రీలంక ఓపెనర్ పాతుమ్ నిస్సాంక నుంచి తీవ్ర పోటీ ఉన్నా జైస్వాల్‌కే అవార్డ్ దక్కింది. కాగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో జైస్వాల్ 89.00 యావరేజ్‌తో 712 పరుగులు బాదారు. ఇందులో రెండు డబుల్ సెంచరీలు ఉన్నాయి. 2023లో వెస్టిండీస్ పర్యటన టెస్టులు అరంగేట్రం చేసిన యశస్వి జైశ్వాల్ అదరగొడుతున్నాడు. మంచి ఫామ్ లో ఉన్న జైష్వాల్ ఇంగ్లాండ్ పై వరుసగా విశాఖపట్నం, రాజ్ కోట్ టెస్టులలో డబుల్ సెంచరీ సాధించాడు. ఒకే సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా యశస్వి రికార్డులు సృష్టించాడు.

 

Read more RELATED
Recommended to you

Latest news