తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో డీఎంకే నేత స్టాలిన్ మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ మేనిఫెస్టోలో తమిళ ప్రజలకి వారాల జల్లు కురిపించారు. రాష్ట్రవ్యాప్తంగా దివంగత నేత కరుణానిధి పేరుతో కలైంజర్ క్యాంటిన్‌ల ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అలానే నీట్ పరీక్షను తమిళనాడులో రద్దు చేస్తామని, అధికారంలోకి వస్తే ప్రైవేట్ కంపెనీలలో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు లభించేలా చట్టం తెస్తామని ప్రకటించారు. పదేళ్లుగా టెంపరరీ కొలువు చేస్తున్న వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేస్తామని ప్రకటించారు.
దివంగత నేత జయలలిత మరణంపై విచారణ వేగవంతం చేస్తామని, అసెంబ్లీ సమావేశాలను ప్రజలు వీక్షించేలా మీడియాలో ప్రసారాలకు అనుమతి ఇస్తామని ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగాలలో 40 శాతం మహిళలకు అవకాశం కల్పిస్తామన్న ఆయన పోలీసులు డ్యూటీ సమయంలో మృతి చెందితే కుటుంబానికి కోటి రూపాయిలు ఆర్థిక సహాయం చేస్తమని ప్రకటించారు. అలానే పెట్రోల్‌పై అయిదు రూపాయలు, డీజిల్ ఫై నాలుగు రూపాయిలు తగిస్తామని, ప్రజలు నిత్యం ఉపయోగించే పాలపై లీటర్‌కు మూడు రూపాయిలు తగిస్తామని ప్రకటించారు. గ్యాస్ సిలిండర్‌పై వంద రూపాయిలు ప్రభుత్వం తరపున సబ్సిడీ ఇస్తామని, హిందూ ఆలయాల పరిరక్షణకు వెయ్యి కోట్లు ప్రకటిస్తామని అన్నారు.