ఉద్యోగం వద్దని పిచ్చిదానిగా ముద్రవేశారు…!

-

రాప్తాడు నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. మరూరు సబ్ సెంటర్ ఆశా వర్కర్ ఉద్యోగానికి రాజీనామా చేయాలని ఆదిలక్ష్మి అనే మహిళను బెదిరిస్తున్నారు. 15 సంవత్సరాలుగా మరూరు సబ్ సెంటర్ లో ఆశావర్కర్ గా ఆమె సేవలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… మానసికస్థితి సరిగా లేదంటూ లెటర్ రాసి బలవంతంగా అధికారులు సంతకం పెట్టించుకున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు.A Digital Disruption for Asha Workers - Express Healthcare

గ్రామంలో ఉంటే కుటుంబ సభ్యులను చంపుతామంటూ అధికార పార్టీ నేతలు బెదరిస్తున్నారని, చేతిలో పురుగుల మందు బాటిల్ పెట్టి… పురుగుల మందు తాగాలని బలవంతం చేస్తున్నారని ఆమె వాపోయారు. గ్రామంలో ఎక్కడ నివాసముంటున్నా.. బలవంతంగా అధికార పార్టీ నేతలు ఖాళీ చేయిస్తున్నారని అన్నారు. వేతనం ఇవ్వకుండా ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన్నా న్యాయం జరగడం లేదని ఆవేదన చెందారు.

Read more RELATED
Recommended to you

Latest news