ఆ రసికుడైన హీరొ ఆ సాప్ట్ హీరోయిన్ కూడా పట్టేసాడా..!!

-

తాను ఓ స్టార్ హీరో అతని నటన కంటే అతని ప్రేమ సంబందాల తోనే ఎక్కువ పాపులర్ అయ్యాడు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ ను ప్రేమ పేరుతో తన బుట్టలో వేసుకున్నాడు. ఇక వారిని అన్ని రకాలగా వాడుకుంటూ, అవసరం తీరిన తరువాత కొత్త వాళ్ళను గోకడం స్టార్ట్ చేస్తాడు. అదేంటో విచిత్రం చాలా మంది స్టార్ హీరోయిన్స్ కూడా తన మైకంలో పడిపోయారు.ఆ హీరో పెదవి ముద్దు ఫోటోస్ మీడియాలో హల్చల్ చేసాయి.చాలా మంది అతని నుండి తప్పించుకొని వేరే వాళ్ళను చూసుకున్నారు. ఆ హీరోనే కోలీవుడ్ స్టార్ శింబు.

మొదట్లో శింబు తమిళంలో నటించి హిట్టు కొట్టిన ‘మన్మథ’ అనే  డబ్బింగ్ మూవీ తెలుగులో కూడా వచ్చింది. మన్మథ సినిమా తరువాత నయనతార తో కలసి వల్లభ’ సినిమా లో నటించాడు. ఈ సమయంలో వీరిద్దరి మధ్య  ప్రేమ పుట్టి అది హద్దులు దాటి ఎక్కడకో వెళ్లి పొయింది.ఆరోజుల్లో సినిమా పేజీలలో వీరి రొమాన్స్ ఫోటోస్ ప్రచురించ బడ్డాయి. తర్వాత ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి విడిపోయారు . మళ్లీ శింబు హీరోయిన్ హన్సిక తో పులిహోర కలిపి సక్సెస్ అయ్యాడు. ఇద్దరూ చాలా రోజులు కలసి తిరిగారు. అవసరం తీరిన తరువాత ఇద్దరూ విడిపోయారు.

 

ఇప్పుడు లేటెస్ట్ గా తాను ఒక సాప్ట్ హీరోయిన్ ను ప్రేమ పేరుతో ముగ్గులోకి దింపినట్లు సమాచారం వస్తోంది.ఆమె ఎవరో కాదు. ‘మహానటి’ సినిమాతో సౌత్ ఇండస్ట్రీలోనే గొప్ప నటిగా పేరు తెచ్చుకున్న కీర్తి సురేశ్ అని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈమె  శింబు తో ప్రేమలో వున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరు కలిసి కొన్ని రోజుల క్రితం ఒక రెస్టారెంట్ కు డిన్నర్ కు కూడా వెళ్లారట. వీరిద్దరూ ప్రేమలో పడినట్లు కోలీవుడ్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది

Read more RELATED
Recommended to you

Latest news