క్యారెట్ బ్రౌన్ రైస్ రెసిపీ

-

బ్రౌన్ రైస్ వల్ల చాలా ప్రయోజనాలు మనకి లభిస్తాయి. బ్రౌన్ రైస్ తో రుచికరమైన రెసిపీస్ ని ఎన్నో మనం ట్రై చేయొచ్చు. అయితే ఈ రోజు మనం క్యారెట్ బ్రౌన్ రైస్ ఎలా తయారు చేసుకోవాలి…?, దానికి కావలసిన పదార్ధాలు ఏమిటి అనేది చూద్దాం.

క్యారెట్ బ్రౌన్ రైస్ కి కావలసిన పదార్ధాలు:

ఒక పెద్ద ఉల్లిపాయ
రెండు మీడియం సైజు క్యారెట్లు
ఒక టేబుల్ స్పూన్ బటర్
ఒక కప్పు బ్రౌన్ రైస్
అర టీ స్పూన్ సాల్ట్
1 స్పూన్ మిరియాల పొడి

క్యారెట్ బ్రౌన్ రైస్ తయారు చేసే విధానం:

ఈ రెసిపీని ఎంతో ఈజీగా చేసేయచ్చు. దీని కోసం ముందుగా మీరు ఒక సాస్ పాన్ తీసుకుని అందులో ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, బటర్ వేసి వేయించాలి. ఇప్పుడు బ్రౌన్ రైస్ ని ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. వేయించుకున్న ముక్కల్లో ఉడికించుకుని పక్కన పెట్టిన బ్రౌన్ రైస్ ని వేసేయాలి. ఇప్పుడు సాల్ట్ మరియు మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. కాసేపు అలా వదిలేసి కుక్ అయిన తర్వాత సర్వ్ చేసుకోవడమే.

పోషక విలువలు:

3/4 కప్: 231 క్యాలరీలు,
4గ్రాముల ఫ్యాట్
8mg కొలెస్ట్రాల్
551mg సోడియం
44g కార్బోహైడ్రేట్
4g ప్రోటీన్

Read more RELATED
Recommended to you

Latest news