ఎస్‌బీఐ కస్టమర్లకు శుభ‌వార్త‌.. ఇక నుంచీ మరింత చౌకగా హోమ్ లోన్..!

-

అద్దె ఇంట్లో ఉండలేక పోతున్నారా ? కొత్త ఏడాదిలో కొత్తింటిని తీసుకోవాలనుకుంటున్నారా ? సొంతింటిలో కుటుంబంతో హాయిగా జీవితం గడపాలనుకుంటున్నారా ? ఇలాంటి వారికోసమే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI గుడ్ న్యూస్ తెలిపింది. అదేంటంటే.. హోమ్ లోన్లపై వడ్డీ రేట్లను తగ్గించింది. రిజర్వు బ్యాంక్ (ఆర్‌బీఐ) రెపో రేటును యథాతథంగా కొనసాగించినప్పటికీ బ్యాంక్ ఇప్పుడు రుణ రేట్లలో కోత విధించింది. దీంతో రుణం తీసుకునే వారికి ప్రయోజనం కలుగనుంది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ అన్ని కాల వ్యవధులపై 5 బేసిస్ పాయింట్స్ తగ్గించింది. కొత్త వడ్డీ రేట్లు ఫిబ్రవరి 10 నుంచి అమలులోకి వస్తాయి. రేట్లను సవరించిన తర్వాత ఏడాది ఎంసీఎల్ఆర్ ఏడాదికి 7.90 శాతం నుంచి 7.85 శాతానికి తగ్గింది.

బ్యాంక్ ఎంసీఎల్ఆర్ రేటు తగ్గించడం 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఇది తొమ్మిదో సారి కావడం గమనార్హం. అలాగే ఎంసీఎల్ఆర్ తగ్గడంతో హోమ్ లోన్ వడ్డీ రేట్లు కూడా తగ్గనున్నాయి. హోమ్ లోన్ వడ్డీ రేటు 7.90 శాతానికి తగ్గింది. ఇప్పటికే హోమ్ లోన్లు తీసుకున్నవారికి ఈఎంఐలు తగ్గుతాయి. ఇకపై హోమ్ లోన్ తీసుకునేవారికి కొత్త వడ్డీ రేట్లు వర్తిస్తాయి. అదే విధంగా ఫిక్స్‌డ్ డిపాజిజ్ రేట్లు కూడా తగ్గించేసింది. ఎఫ్‌డీ రేట్లను 10 నుంచి 50 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించింది. దీంతో బ్యాంక్‌లో డబ్బు ఎఫ్‌డీ చేయాలని భావించే వారికి తక్కువ రాబడి వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news