ధ‌నిక రాష్ట్రం : భారీగా పెర‌గిన రాష్ట్ర ప్ర‌భుత్వ పన్నులు ఆదాయం

-

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ఆర్థికంగా ఎదుగుతుంది. ఇప్ప‌టికే తెలంగాణ రాష్ట్రంలో త‌ల‌స‌రి ఆదాయం.. రూ. 2,78,833 గా ఉంద‌ని కేంద్రం ధృవీక‌రించిన విషయం తెలిసిందే. అలాగే రాష్ట్ర వృద్ధి రేటు 19.46 శాతం తో రూ. 1,154,860 న‌మోదు అయింది. ఇవి దేశంలో అత్య‌ధికంగా న‌మోదు అయ్యాయని స్వ‌యంగా కేంద్ర‌మే వెల్ల‌డించింది. తాజా గా తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌న్నుల ద్వారా వ‌స్తున్న ఆదాయం కూడా భారీగా పెరిగింది. జ‌న‌వరి నెల చివ‌రి వ‌ర‌కు దాదాపు 80 శాతం వ‌ర‌కు అంచ‌నాల‌ను అందుకుంది.

గ‌త ఏడాది జ‌న‌వరి నెల‌కు కేవలం 60 శాతం మాత్ర‌మే ఉండ‌గా.. ఈ సారి 20 శాతం మేక పెరిగి.. 80 శాతానికి చేరుకుంది. ఎక్సైజ్ ప‌న్ను తో పాటు అమ్మకం ప‌న్ను అంచనాలు కూడా 80 శాతం దాటాయి. రుణాల ల‌క్ష్యం 97 శాతం అధిగ‌మించాయి. ఈ నివేధిక‌ల‌ను అన్నీ కంప్ట్రోల్ట‌ర్ అండ్ ఆడిట‌ర్ జ‌న‌ర‌ల్ ( కాగ్ ) కు రాష్ట్ర ప్ర‌భుత్వం అందించింది. కాగ గ‌త ఆర్థిక ఏడాది తో పోలిస్తే.. ఈ ఆర్థిక సంవ‌త్స‌రం రాష్ట్ర ప్ర‌భుత్వం పన్నుల ద్వారా భారీగా ఆదాయాన్ని స‌మ‌కూర్చింది. జ‌న‌వ‌రి నెల చివ‌రి వ‌ర‌కు రూ. 98 వేల కోట్ల ఆదాయం వ‌చ్చింద‌ని కాగ్ కు రాష్ట్ర ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. ఇది బ‌డ్జెట్ అంచ‌నాల్లో ఏకంగా 55 శాతంగా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news