రేపు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు: మాజీ మంత్రి హరీశ్ రావు

-

కవిత అరెస్టును వ్యతిరేకిస్తూ రేపు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని ఆ పార్టీ నేత హరీశ్ రావు ప్రకటించారు. ‘కవిత అరెస్టు బీజేపీ, కాంగ్రెస్ కుట్ర. అరెస్టు అప్రజాస్వామికం, అక్రమం, అనైతికం అని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అక్రమ అరెస్టుపై పిటిషన్ వేస్తాం.

సుప్రీం కోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా కావాలనే శుక్రవారం రోజు అరెస్ట్ చేశారు.ఈ అరెస్టును బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. న్యాయపరంగా పోరాడతాం అని పేర్కొన్నారు. మాకు పోరాటాలు కొత్తకాదు. మా పార్టీ పుట్టిందే ఉద్యమంలో’ అని హరీశ్ రావు స్పష్టం చేశారు.

కాగా,ఇవాళ ఢిల్లీ నుండి వచ్చిన ఐటీ, ఈడీ అధికారుల బృందం హైదరాబాద్లోని ఆమె ఇంట్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. దాదాపు 4 గంటల పాటు అధికారులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని విచారించారు. అనంతరం కోర్టు అనుమతితో కవితకు ఈడీ అధికారులు అరెస్ట్ నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news