ఉదృతమవుతున్న స్టీల్ ప్లాంట్ ఆందోళన.. రాత్రి నుండి నేషనల్ హైవే బ్లాక్ !

-

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ తప్పదని కేంద్రం ప్రకటించడం మీద విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు భగ్గుమంటున్నాయి. నిర్మల సీతారామన్ ప్రకటన వచ్చినప్పటి నుంచి కార్మికులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. రాత్రి నుంచి జాతీయ రహదారి మీద కార్మికులు ఆందోళన చేస్తున్నారు. కూర్మన్నపాలెం స్టీల్ ప్లాంట్ వద్ద ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాత్రి 7 గంటల నుంచి నిరాటంకంగా రహదారి దిగ్బంధం కొనసాగుతోంది. పలు దఫాలు పోలీసులు చర్చలు జరిపినా కార్మికులు వెనక్కు తగ్గడం లేదు. దీంతో రాత్రి నుంచి వాహనదారులు అవస్థలు పడే పరిస్థితి ఏర్పడింది.

చివరికి పోలీసులు దూరప్రాంత వాహనాలను పంపారు. ఇక దాదాపు కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. స్టీల్ ప్లాంట్ కి మార్నింగ్ షిఫ్ట్ కి వెళ్లే వారిని సైతం నిర్వాసితులు అడ్డుకుంటున్నారు. ఈరోజు స్టీల్ ప్లాంట్ పరిపాలన కార్యాలయం ముట్టడికి కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఉదయం 9 గంటలకు ముట్టడికి రావాలని పిలుపునిచ్చాయి. స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవడానికి ఎందాకైనా వెళ్దామని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. అలాగే పార్టీలకు అతీతంగా నేతలు అందరూ రాజీనామాలు చేసి ఉద్యమంలోకి రావాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news