తన రాజకీయ రంగ ప్రవేశం మీద బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నా పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలియదు అని చెప్పుకొచ్చారు. కానీ ఏదైనా అప్పటికప్పుడే జరిగిపోతుందని సౌరవ్ గంగూలీ పేర్కొన్నారు. ఒక్క రాజకీయాలనే కాదని తన జీవితంలో దాదాపుగా అన్నీ అలాగే అప్పటికప్పుడు జరిగిపోయాయని అందుకే ఒకవేళ తన జీవితంలో రాజకీయాలు చేయాలని రాసిపెట్టి ఉంటే అది కూడా అలాగే జరుగుతుందని దాదా చెప్పుకొచ్చాడు.
తనకు కెప్టెన్సీ ఆ తర్వాత బీసీసీఐ అధ్యక్షుడు పదవి కూడా అలాగే వచ్చాయి అని చెప్పుకొచ్చారు. ఈ రెండు విషయాలు కూడా ఊహించకుండానే అప్పటికప్పుడు వచ్చాయని కాబట్టి రాజకీయం కూడా అలాగే ఉంటుందని చెప్పుకొచ్చారు. నిజానికి పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేస్తారంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ కామెంట్ చేశారు అని అంటున్నారు. పశ్చిమ బెంగాల్ ఆయన సొంత రాష్ట్రం అన్న సంగతి తెలిసిందే.