తమిళనాడులో ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో రాజకీయాలు హీటెక్కి పోటా పోటీగా ఉచిత హామీలు గుప్పిస్తున్నారు పార్టీలకు చెందిన నేతలు. ఇప్పటికే ఐదేళ్లలో 50 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని స్టాలిన్ ప్రకటించారు. అంతేకాక ప్రతి మహిళకు వెయ్యి రూపాయలు చొప్పున ఆర్థిక సాయం చేస్తామని కూడా ప్రకటించారు. అయితే స్టాలిన్ మా మేనిఫెస్టో కాపీ కొట్టారని కమలహాసన్ ఆరోపిస్తున్నారు.
మరోపక్క డీఎంకేని మించి అన్నాడీఎంకే వరాలు కురిపించింది. డీఎంకే మహిళలకు 1000 రూపాయలు ఇస్తామంటే తాము మహిళలకు 1500 ఇస్తామని సీఎం పళనిస్వామి ప్రకటించారు. అంతేకాక కుటుంబానికి ఏడాదికి ఆరు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. దీంతో ఉచిత హామీలతో తమిళనాడు ఓటర్లు తడిసి ముద్దవుతున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ డీఎంకే కలిసి పోటీ చేస్తుండగా అన్నాడీఎంకే బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి. ఇక కమల్ హాసన్ ప్రస్తుతానికి ఎవరితో పొత్తు పెట్టుకోకున్నా, ఆయన కూడా పొత్తులు పెట్టుకుని అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.