నగరవాసులకు అలర్ట్.. రెండు రోజులపాటు ఈ ప్రాంతాలకి నీటి సరఫరా అంతరాయం

-

హైదరాబాద్ నగరవాసులకు అధికారులు కీలక సూచన చేశారు. హైదరాబాద్‌కు తాగు నీరు సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ ఫేజ్-2లోని కోదండాపూర్ పంప్ హౌజ్‌లో వాల్వ్ మరమ్మతులకు గురైనట్లు జలమండలి అధికారులు తెలిపారు.

దీంతో అత్యవసరంగా నీటి సరఫరా నిలిపివేసే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు కూడా జరుగుతున్నాయని, పనులు పూర్తయిన వెంటనే.. యథావిధిగా నీటి సరఫరా పునరుద్ధరిస్తామని వెల్లడించారు. ఈ మరమ్మతుల పనుల కారణంగా జలమండలి పరిధిలోని పలు ప్రాంతాల్లో నేడు, రేపు తాగునీటి సరఫరాలో కొన్నిచోట్ల పూర్తి అంతరాయం, మరికొన్ని చోట్ల పాక్షిక అంతరాయం ఏర్పడుతుందని ,కొన్నిప్రాంతాల్లోలో లో ప్రెజర్‌తో నీరు సరఫరా అవుతుందని తెలిపారు. మిరాలం, బాలాపూర్, మైసారం,భోలక్ పూర్, చిలకల గూడ, బార్కాస్ భోజగుట్ట, ఆళ్లబండ, మేకలమండి, తార్నాక, లాలాపేట్, బౌద్ధ నగర్, ప్రకాశ్ నగర్, పాటిగడ్డ, హస్మత్ పేట్,మారేడ్ పల్లి, కంట్రోల్ రూమ్, రైల్వేస్, MES, కంటోన్మెంట్, ఫిరోజ్ గూడ, గౌతమ్ నగర్, వైశాలి నగర్, బీఎన్ రెడ్డి నగర్, అల్కపురి కాలనీ, వనస్థలిపురం, ఆటోనగర్,మహీంద్రహిల్స్, మీర్ పేట్, బడంగ్ పేట్,ఏలుగుట్ట,నాచారం, బీరప్పగడ్డ,హబ్సిగూడ, రామంతాపూర్, ఉప్పల్, చిల్కా నగర్, బుద్వేల్, శాస్త్రిపురం, శంషాబాద్ ప్రాంతాల్లో నీటి సరఫరాలకు అంతరాయం ఏర్పడుతుందని ,నీటి సరఫరాలో సమస్య ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news