మనదేశంలో మాత్రం ఇంకా చాలా ప్రాంతాల్లో 4జీ స్పీడ్ సరిగ్గా రాక నానా తంటాలు పడుతున్నారు. కానీ, ప్రపంచం దృష్టి రానున్న 5జీ స్పీడ్ మీద ఉంది. ప్రతి ఒక్కరూ కూడా మన మొబైల్ లో 4జీ డేటా స్పీడ్ ఎందుకు తక్కువగా వస్తుంది అనేది ముఖ్యంగా తెలుసుకోవాలి. మొబైల్ స్పీడ్ అనేది మీరు మొబైల్ టవర్ నుంచి ఎంత దూరంలో ఉన్నారు, ఎంత మంది యూజర్లు 4జీ మొబైల్ టవర్ ను ఉపయోగిస్తున్నారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. అలాగే, మీ ఇంటి లోపల లేదా వెలుపల ఉన్నారా అనే దానిపై ఆధారపడి పనిచేస్తుంది. సాధారణంగా రాత్రి వేళలో డేటా స్పీడ్ తక్కువ వస్తుందని మనకు తెలుసు.
అయితే, కొన్ని పరిస్థితుల్లో మన మొబైల్ లో ఉండే నెట్ వర్క్ సిగ్నల్ సెట్టింగ్స్ కారణంగా కూడా తక్కువ వచ్చే అవకాశముంది. 4జీ వోల్టే కనెక్టివిటీతో కూడిన స్మార్ట్ ఫోన్ల సంఖ్య పెరిగిపోవడం ఒక కారణం. ఇంటర్నెట్ స్పీడ్ అనేది పరిమిత పరిధిలో స్పెక్ట్రమ్ ఫలితంగా వస్తుంది. ఫోన్ లో 4జీ వేగాన్ని మెరుగుపరచడానికి కొన్ని పద్ధతులు తెలుసుకుందాం.
- మొదట ఫోన్ సెట్టింగ్‌లోకి వెళ్లి మొబైల్ నెట్‌వర్క్ ద్వారా ‘4జీ‘ను ఎనేబుల్ చేయండి.
- సెట్టింగ్‌లో ఉండే యాక్సెస్ పాయింట్ పేర్లను క్లిక్ చేసి ఏపీఎన్ ను డిఫాల్టుగా రీసెట్ చేయండి
- అవసరం లేని యాప్స్ ఇంటర్నెట్ వేగాన్నీ తగ్గిస్తాయి
- వాటిని అన్‌ఇంస్టాల్ చేయడం లేదా బ్యాక్ గ్రౌండ్ డేటా ఆప్షన్ నిలిపి వేయాలి.
- 4జీ ఇంటర్నెట్ సరిగ్గా రాకపోతే ఒకసారి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయాలి.
- కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మీ నెట్‌వర్క్ సెట్టింగ్స్‌ను రీసెట్ చేయడం ఉత్తమం