చర్మంపై మచ్చలా? లెమన్ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి.

-

చర్మం గురించిన శ్రద్ధ ప్రతీ ఒక్కరికీ అవసరం. ఎందుకంటే మన శరీరంలో ఎక్కువగా వ్యాధులకి గురయ్యేది అదే కాబట్టి. చర్మ రక్షణ సాధనాలని మార్కెట్లో అంతగా డిమాండ్ ఉండడానికి కారణం అదే. ఇంట్లో తయారు చేసుకునే చాలా సాధనాలు చర్మానికి రక్షణ కలిగిస్తాయి. అందులో నిమ్మకాయ చేసే మేలు కూడా ఉంది. చాలా రోజులుగా నిమ్మకాయని చర్మానికి మేలు చేసే కారకంగా వాడుతున్నారు. ఇందులో ఉండే విటమిన్ సి, అనేక చర్మ ఇబ్బందులని దూరం చేస్తుంది.

చర్మంపై మచ్చలు, చర్మం రంగు మొదలగు విషయాల్లో నిమ్మకాయతో చేసిన ఫేస్ ప్యాక్స్ బాగా పనిచేస్తాయి. వాటిని ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

ఫేస్ స్క్రబ్

చల్లటి పాలలో నిమ్మకాయ రసాన్ని పిండి బాదంపొడిని, నారింజ తొక్కలని అందులో కలుపుకోవాలి.

ఎలా మర్దన చేసుకోవాలి.

ఈ మూడింటి మిశ్రమాన్ని ముఖానికి బాగా మర్దన చేసుకోవాలి. పది నిమిషాల తర్వాత నీటితో కడుక్కుంటే సరిపోతుంది.

మచ్చలు పోవాలంటే

పాలు, నిమ్మరసం, టమాట రసం బాగా కలుపుకుని, ముఖానికి దట్టించాలి. పదినిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకుంటే చాలు.

అందమైన ముఖం కోసం

బాగా పండిన అరటి పండుని నుజ్జు నుజ్జుగా చేసి, దానికి నిమ్మరసాన్ని జోడించి ముఖానికి పెట్టుకోవాలి. చర్మం రంగు ఎక్కడెక్కడ తేడాగా ఉందో అక్కడక్కడ పెట్టుకున్నా బాగుంటుంది. పది నిమిషాల తర్వాత నీటితో కడుక్కోవాలి.

ఈ విధంగా వారానికి రెండు నుండి మూడు సార్లు చేస్తే చర్మంపై ఉన్న మచ్చలు తొలగిపోయి, చర్మం రంగు మెరిసేలా తయారయ్యి అందంగా కనిపిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news