భారీ నష్టాల్లోకి స్టాక్ మార్కెట్లు… రష్యా- ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలతో ఒడిదుడుకులు

-

అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు, రష్యా- ఉక్రెయిన్ యుద్ధ పరిణామాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ప్రారంభం అయ్యాయి. 1695 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్​ 52,638 వద్ద ట్రేడ్​ అవుతోంది. మరోవైపు.. 450 పాయింట్ల నష్టంతో 15,794 వద్ద నిఫ్టీ కొనసాగుతోంది. ఉక్రెయిన్ – రష్యా మధ్య ఉద్రిక్త పరిస్థితులు మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ చమురు ధర 130 డాలర్లకు చేరుకుంది. దీంతో అంతర్జాతీయంగా ద్రవ్యోల్భన పరిస్థితులు ఏర్పడుతాయని భయాలు నెలకొన్నాయి.

రష్యాపై ఇప్పటి వరకు కఠిన ఆంక్షలు విధించిన పాశ్చాత్య దేశాలు… ఆదేశం నుంచి ఎగుమతి అవుతున్న చమురుపై కూడా ఆంక్షలు విధించే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ పరిస్థితులు అంతర్జాతీయ మార్కెట్లను సైతం తీవ్ర ప్రభావానికి లోనవుతున్నాయి. అమెరికా ఫ్యూచర్ మార్కెట్లు తీవ్ర నష్టాలకు లోనవుతున్నాయి. ఇవాళ ఆసియా-ఫసిఫిక్ మార్కెట్లు తీవ్ర నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. దీంతో ఉదయం నుంచి మార్కెట్లు తీవ్ర నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. చమురు ధరలు ఎంత పెరుగుతాయో దానిని బట్టి మనదేశంపై ప్రభావం పడే అవకాశం ఉందని.. 80 శాతం చమురు దిగుమతి చేసుకుంటాము కాబట్టి దీనిని బట్టి స్టాక్ మార్కెట్లకు ప్రభావితం అయ్యే అవకాశం ఉందని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news