నేడు విజయనగరంలో పర్యటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసిపి ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కరోనా సమయంలో కూడా దోచుకున్నారని ఆరోపించారు. పదివేల అరువందల కోట్లు అవినీతి జరిగిందని.. దీనిపై మోడీకి వివరాలను అందిస్తానన్నారు. వైజాగ్ లో ఇలాగే రాజధాని నిర్మిస్తారా..? అని ప్రశ్నించారు.
డబ్బుతో పని లేదని తన సొంత డబ్బు ఖర్చు చేస్తానన్నారు. నేడు విజయనగరానికి వస్తుంటే 14 కిలోమీటర్ల మేర స్వాగతం పలికారని తెలిపారు. పెద్దఎత్తున ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు జనసేనాని. ఇళ్ల నిర్మాణం పేరుతో పన్నెండు వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ఆరోపించారు. జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత.. పేదలందరికీ ఉచితంగా ఇసుక అందిస్తామని హామీ ఇచ్చారు. వైసిపి ప్రభుత్వం రాష్ట్రంలో కనీసం రోడ్లు కూడా వెయ్యలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బొత్స జేబులో సొమ్ము కాదని..మన టాక్స్ లు ద్వారా వచ్చిన డబ్బులతో ఇదంతా ఇస్తున్నారని తెలిపారు. రాజధాని వస్తే ఉత్తరాంధ్ర బాగుపడతాదని ఉత్తిమాటలే చెబుతున్నారని అన్నారు. రోడ్లే వేయ్యని వైసీపీ ప్రభుత్వం రాజధాని కడతారని నమ్ముతున్నారా..? అని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం పోలీస్ సొసైటీ భూములను కూడా కుదవ పెట్టిందని అన్నారు.