ఉక్రెయిన్ పై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యుద్ధం ప్రకటించిన విషయం తెలిసిందే. రష్యాకు చెందిన లక్షల మంది సైనికులు.. ఉక్రెయిన్ నగరాల్లో బాంబుల వర్షం కురిపిస్తున్నారు. మిస్సైల్స్ తో ఉక్రెయిన్ ను వణికిస్తున్నారు. ఉక్రెయిన్ కూడా బలమైన రష్యా ను ఎదుర్కొంటుంది. అలాగే ఇప్పటి వరకు ఓంటరి పోరాటం చేస్తున్న ఉక్రెయిన్.. ప్రపంచ దేశాల సాయం కోసం ఎదురు చూస్తుంది. పలు దేశ అధినేతల మద్దతు కోసం ఫోన్లు చేస్తుంది.
తాజా గా భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఫోన్ చేశారు. రష్యా చేస్తున్న దురాక్రమణను ఆపించాలని కోరారు. అలాగే ఐక్య రాజ్య సమతి భద్రతా మండలిలో తమ దేశానికి మద్దతు తెలపాలని కోరారు. అలాగే ప్రస్తుతం ఉక్రెయిన్ దేశంలో యుద్ధ పరిస్థితుల గురించి ప్రధాని మోడీకి ఫోన్ లో వివరించారు. వందల సంఖ్యలో సైనికులు, ప్రజలు చనిపోతున్నారని అన్నారు. అలాగే తమ నివాసాలపై కూడా కాల్పులు జరుపుతున్నారని అన్నారు. కాగ రష్యా యుద్దం ప్రకటించిన నాటి నుంచి.. ఉక్రెయిన్ కు మద్దతుగా ఇప్పటి వరకు ఏ ఒక్క దేశం కూడా ముందుకు రాలేదు.