అడవి పులా.. వింత జంతువా.. భయాందోళనలో గొల్లప్రోలు..!!

-

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో వింత జంతువు సంచారం చేస్తోందన్న వార్త తీవ్ర కలకలం రేపుతోంది. గొల్లప్రోలు మండలం కొడవలి, పోతలూరు గ్రామంలో ఓ జంతువు సంచరిస్తోందని, రాత్రి వేళల్లో ఎవరూ బయటకు రావొద్దంటూ ఓ పుకారు షికారు చేస్తోంది. ఈ విషయాన్ని గ్రామ సర్పంచే స్వయంగా సెల్ఫీ వీడియో తీసి అందరికీ షేర్ చేస్తున్నారు. అయితే ఆ జంతువు.. అడవి పులా..? లేదా వింత జంతువా..? అనే విషయం ప్రశ్నార్థకంగా మారింది. కాగా, నిన్న ఆ జంతువు ఒక గేదెను చంపేసింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

పెద్ద పులి
పెద్ద పులి

ఈ మేరకు ఏలేశ్వరం అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పాదముద్రలు సేకరిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ప్రత్తిపాడు మండలంలోని ఒమ్మంగి, శరభవరం గ్రామాల్లో కొండలపై మేతకు వెళ్లిన పశువులు కూడా మాయమైనట్లు సమాచారం. ఈ మేరకు పశువులను చంపిన మృగం కోసం అటవీశాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. తాజాగా శుక్రవారం పోతులూరులో మరో గేదెను చంపేసింది. గేదె మెడపైన ఉన్న గాయాలు, చంపిన తీరును బట్టి పెద్దపులిగా అనుమానిస్తున్నారు. త్వరలో ఆ మృగాన్ని కనిపెడతామని ఫారెస్ట్ సిబ్బంది తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news