ఢిల్లీ శివార్లలో ఉన్న గుర్గావ్ లో విషాదం చోటుచేసుకుంది. జోరున వర్షం పడుతూ ఉండడంతో తడవకుండా ఉండేందుకు నలుగురు వ్యక్తులు ఓ చెట్టు కిందకు వెళ్లి నుంచున్నారు. అయితే తామొకటి తలిస్తే దైవం ఒకటి తలచాడు అన్నట్టు వాళ్ళు ఆ చెట్టు కింద ఉండగా ఆ చెట్టుపై పిడుగు పడింది. ఈ దుర్ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ దారుణ దృశ్యాలు అక్కడ ఏర్పాటు చేసిన సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పిడుగు పడిన వారిలో ఇద్దరి ఆరోగ్యం నిలకడగా ఉందని, మరొకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. నిజానికి వర్షం పడేటప్పుడు చాలా మంది చెట్ల కిందకు వెళుతుంటారు, కానీ ఇది ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చెట్టుపై పిడుగు పడుతున్న దృశ్యాలు అక్కడికి సమీపంలో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. పిడుగు పడిన వెంటనే నలుగురూ పిట్టలు రాలినట్టు రాలి పడిపోవడం కనిపిస్తుంది.
Deadly Lightening in Gurgaon pic.twitter.com/nHygeNH3jX
— Sheela Bhatt शीला भट्ट (@sheela2010) March 12, 2021