వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో మరో విద్యార్థి అన్యాయం గా బలవన్మరణానికి పాల్పడ్డాడు. బెంగాల్ జాదవ్ పూర్ వర్శిటీకి చెందిన స్వప్నదీప్ అనే విద్యార్థి డిగ్రీ BA విద్యను అభ్యసిస్తున్నాడు. ఇక మొదటి సంవత్సరం చదువుతున్న ఈ విద్యార్థికి సీనియర్స్ నుండి ర్యాగింగ్ వేధింపులు ఎక్కువ కావడంతో భరించలేని పరిస్థితిలో అవమాన భారంతో ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాడు. అయితే ఈ ఆత్మహత్యకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచాయి. స్వప్నదీప్ ను గే అంటూ సీనియర్ విద్యార్థులు రోజూ ర్యాగింగ్ చేస్తున్నారట… ఎంత చెబుతున్నా వినకుండా రోజూ అదే విధంగా పిలుస్తూ వేధిస్తుండడం మరియు బట్టలు విప్పి వేరే గదిలోకి వెళ్లాలని.. ఇలా రకరకాలుగా ఇబ్బంది పెట్టడంతో విసిగిపోయి తన చావుతోనే వీరికి సమాధానం ఇవ్వాలని అనుకున్న స్వప్నదీప్ నేను గే కాదు అంటూ అరుస్తూ బిల్డింగ్ పై నుండి కిందకు దూకేశాడట..
ఈ కేసులో ప్రధాన నిందితుడు గా ఉన్న సౌరభ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.