కృష్ణా: జిల్లా సబ్ కలెక్టర్ సూర్య సాయి ప్రవీణ్ చంద్ కైకలూరులో సినీ ఫక్కీల్లో ఆశ్చర్యపర్చారు. మారువేషంలో ఎరువుల షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. రైతు వైషధారణలో ఎరువులు కొనేందుకు షాపులకు వెళ్లారు. ఎరువుల ధరలు అడిగి తెలుసుకున్నారు. కొన్ని చోట్ల సమయానుసారంగా షాపులు తీయలేదు. మరికొన్ని చోట్ల ఎరువులు అధిక ధరలకు అమ్ముతుండటాన్ని గుర్తించారు. రసీదులు ఇవ్వకుండా రైతులను మోసం చేస్తున్నట్లు నిర్ధారించారు.
దీంతో దుకాణదారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక వ్యవశాఖ అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. ఎప్పటికప్పుడు షాపుల్లో తనిఖీ చేయాలని సూచించారు. అటు నిబంధనలను అతిక్రమించిన రెండు షాపులను సీజ్ చేయడంతోపాటు జరిమానాను విధించారు. జిల్లాలో ఎరువుల షాపులు యజమానులు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని సూచించారు. అధిక ధరలకు ఎరువులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు లేకపోతే ప్రపంచం ఉండదని… అలాంటి రైతులు ఎలా మోసం చేస్తున్నారని మండిపడ్డారు.