నటన బాలేదని సూర్య మొహం మీదే చెప్పేసిన డైరెక్టర్..

-

తమిళ నటుడు సూర్యకి తెలుగులో మంచి మార్కెట్ ఉండేదిఉ. కానీ కొంతకాలంగా సూర్య చేస్తున్న సినిమాలన్నీ ఫ్లాపుగా మారడంతో మార్కెట్ బాగానే తగ్గింది. ఐతే ప్రస్తుతం ఆకాశం నీ హద్దురా సినిమాతో ప్రేక్షకులని పలకరించబోతున్నాడు. అమెజాన్ ప్రైమ్ లో విడుదల అవుతున్న ఈ చిత్రానికి సుధ కొంగర దర్శకత్వం వహించారు. తెలుగమ్మాయి అయిన సుధ కొంగర గురించి సూర్య, చాలా ఆసక్తికరమైన విషయాలని పంచుకున్నాడు.

మణిరత్నం దర్శకత్వంలో యువ సినిమా చేస్తున్నప్పటి నుండి సుధ కొంగరతో పరిచయం ఉందని, ఆ సినిమా టైములో ఒకానొక సీన్ తీస్తున్నప్పుడు మణిరత్నం గారు షాట్ ఓకె చెప్పినప్పటికీ అసిస్టెంట్ గా చేస్తున్న సుధ కొంగర ఒప్పుకోలేదట. ఆ సీన్ లో సూర్య నటన సరిగ్గా రాలేదని, అందువల్ల మళ్ళీ ఆ సీన్ ని చేయించిందట. అసిస్టెంట్ గా ఉన్నప్పుడే నటీనటుల నుండి నటనని రాబట్టుకున్న సుధ కొంగర, తన సినిమాలతో మంచి గుర్తింపుని తెచ్చుకుంటుంది. సూర్య ఆకాశం నీ హద్దురా నవంబర్ 12వ తేదీ నుండి అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉండనుంది.

Read more RELATED
Recommended to you

Latest news