విజయ్ దేవరకొండ మరో కొత్త వ్యాపారంలో భాగస్వామి అయ్యారు. హైదరాబాద్ కు చెందిన వాట్స్ అండ్ వోల్ట్స్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. ఐటీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగిన ఎలక్ట్రిక్ వెహికిల్ సమిట్ లో వాట్స్ అండ్ వోల్ట్స్ కంపెనీ తన బిజినెస్ ప్లాన్ ను లాంఛ్ చేసింది.
ఎలక్ట్రిక్ బైక్స్ , స్కూటర్లను అద్దె చెల్లించి ఉపయోగించుకోవచ్చు. ఎలక్ట్రికల్ వాహనాల వల్ల భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన పర్యావరణం అందుతుందని విజయ్ దేవరకొండ అన్నారు. ఈ కంపెనీ అందించే ఎలక్ట్రిక్ బైక్స్ , స్కూటర్లను నగరవాసులు అద్దె చెల్లించి ఉపయోగించుకోవచ్చు. ప్రయాణించే దూరానికి తగినంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. పర్యావరణ హితమైన ఈ స్కూటర్లు, బైక్‌లతో కాలుష్యం తగ్గడంతో పాటు సమయం, డబ్బూ ఆదా కానున్నాయి.