కోట్లాది భక్తుల కొంగు బంగారంగా అలరారుతున్న మణికంఠుడి ప్రధాన దేవాలయం కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలో ప్రధాన పూజరి(మేల్‌సంతి)గా ఏకే సుధీర్ నంబూద్రీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ ఏడాది నవంబర్ 17 నుంచి ఆయన ఆలయ ప్రధాన పూజారిగా ఏడాదిపాటు కొనసాగుతారు.

సుధీర్ నంబ్రూదీ ప్రస్తుతం మలప్పురం జిల్లాలోని తిరువయ్య ఆలయంలో పూజారిగా ఉన్నారు. ఆయన స్థానంలో ఇదే ఆలయానికి ఎర్నాకుళంకు చెందిన ఎంఎస్ పరమేశ్వరన్ నంబూద్రీ పూజారిగా రానున్నారు. ఆలయంలో ఇవాళ ఉదయం డ్రా పద్ధతిలో ప్రధాన పూజారి ఎంపిక జరిగింది. రాబోయే ప్రధాన పూజారికి ప్రస్తుతం ఉన్న పూజారి ఓ నెల రోజుల పాటు ఆలయ వేడుకలకు సంబంధించిన శిక్షణ ఇవ్వనున్నారు. నవంబర్ 16వ తేదీన కొత్త పూజారుల ప్రమాణం జరుగుతున్నది.
ఆ మరుసటి రోజే మండల పూజ కోసం శబరిమల ఆలయద్వారాలు తెరుస్తారు. కొత్త పూజారికి సంబంధించిన డ్రాను స్పెషల్ కమిషనర్ ఎం మనోజ్ పర్యవేక్షణలో నిర్వహించారు.
– కేశవ