సుధీర్, రష్మి ల రాబోయే సినిమా గజ్జల గుర్రం..!!

-

గత శుక్రవారం నాడు సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన  సినిమా గాలోడు  విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఐదు రోజుల్లో దాదాపు నాలుగు కోట్ల  రూపాయల వసూళ్లు సాధించింది. ఇక సినిమా బ్రేక్ ఈవెన్ కూడా సాధించి లాభాల్లో కి అడుగు పెట్టింది. దీనితో ఈ కలెక్షన్స్ చూపి సోషల్ మీడియాలో కొంత మంది హీరోలపై విమర్శలు చేస్తున్నారు.

ఇక రష్మి తో సినిమా ఎప్పుడు అని కామెంట్స్ చేస్తున్నారు. వారి ఆశలు నిజమయ్యే అవకాశం ఉందనిగాలోడు సినిమా దర్శకుడు రాజశేఖర్‌రెడ్డి అన్నారు. వాస్తవానికి గాలోడు సినిమా రష్మి చేయలని కాని డేట్స్ అడ్జస్ట్ కాక వేరే హీరోయిన్ తో చేయాల్సి వచ్చిందని తెలిపారు. ఆమె నటించి ఉంటే సినిమా మరో లెవెల్ లో ఉండేదని అన్నారు.

ఇంకా నా దగ్గర చాలా కథలు ఉన్నాయి.. అవి సుధీర్ గారికి కరెక్ట్ గా సూట్ అవుతాయ్ కాబట్టే ఆయనతో సినిమాలు చేశాను. ఇక రాబోయే సినిమా లో రష్మి ని ఖచ్చితంగా హీరోయిన్ గా తీసుకుంటాం.అది గజ్జల గుర్రం అనే పేరుతో రాబోతుంది.ఇప్పుడు గజ్జల గుర్రం అనేది కథగానే ఉంది. బౌండ్ స్క్రిప్ట్ లేదు. అందుకే కాస్త లేట్ అవుతుంది. ఆయనతో నాకు.. నాకు ఆయనతో పనిచేయడం చాలా హాయిగా, జాలిగా ఉంటుంది. మనకన్నా కూడా ఆయన చాలా అడ్వాన్స్డ్‌గా ఉంటారని డైరెక్టర్ చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news