నడుము నొప్పితో బాధ పడుతున్నారా..? అయితే వీటిని ఫాలో అవ్వండి..!

-

ఈ మధ్య కాలంలో చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా నడుము నొప్పి అందర్నీ ఎక్కువగా వేధిస్తోంది. నడుము నొప్పి సమస్య నుండి బయట పడాలంటే ఈ పద్ధతులను తప్పక అనుసరించాలి. వీటిని కనుక ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా నడుమునొప్పి మాయం అయిపోతుంది. అయితే నడుము నొప్పితో బాధపడే వాళ్ళు ఎలాంటి చిట్కాలు పాటించాలి అనేది ఇప్పుడు చూద్దాం. మరి ఆలస్యం ఎందుకు దీనికోసం ఇప్పుడే పూర్తిగా చూసేయండి.

ఎప్పుడు కూడా లిమిట్ గా ఆహారాన్ని తీసుకోండి. బాగా ఎక్కువ ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఇబ్బందులు వస్తాయి.
అలానే మీ సమయంలో కాస్త సమయాన్ని యోగా, స్పోర్ట్స్ లేదా డాన్స్ వంటి వాటికి కేటాయించండి దీనివల్ల మజిల్స్ మరియు ఎముకలు దృఢంగా ఉంటాయి.
అదే విధంగా ఎక్కువ సేపు ఒకే దగ్గర కోర్చోవద్దు. మీరు కూర్చునేటప్పుడు, నించునేటప్పుడు మంచి పోస్టర్ ని మెయింటెయిన్ చేయండి.
బాగా ఎక్కువ బరువులను ఎత్తినప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి.
హఠాత్తుగా వంగడం, ఏదైనా ఎత్తడం ఇలాంటివి చెయ్యొద్దు.
స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్లు స్మోకింగ్ మానేయడం మంచిది.
నిద్ర పోవడం వల్ల కూడా నడుము నొప్పి తగ్గించుకోవచ్చు.
ఇలా ఈ విధమైన చిట్కాలు ని ఫాలో అయితే కచ్చితంగా నడుంనొప్పి నుంచి బయటపడొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version