సూర్యుడు టాటా చెప్పేసిన నగరం.. 60రోజుల పాటు అంధకారంలో అలస్కా..

-

అసలు సూర్యుడు రాని చోటు భూమి మీద ఎక్కడైనా ఉందా? అలాంటి ప్రదేశాలు నిజంగా ఉంటాయా? సూర్యుడు కనిపించకుండా పోతే మనుషులు బ్రతగ్గలరా? వర్షాకాలంలో ఆకాశం మబ్బులు పట్టి కాస్త ఎక్కువ సేపు సూర్యుడు కనిపించకుండా పోతేనే అమ్మో అనుకుంటాం. అలాంటిది అరవై రోజుల పాటు సూర్యుడు కంటికి కనిపించడం మానేస్తే ఎలా ఉంటుంది? ఊహించుకోవడానికే కష్టంగా ఉంది కదా..

అలాంటి ప్రదేశం భూమి మీద ఉందంటే నమ్మగలరా? అవును.. మీరు వింటున్నది నిజమే. భూమి మీద ఉత్తరాన ఉన్న ఆర్కిటిక్ సర్కిల్ మీద ఉన్న ప్రాంతాల్లో ఇది సంభవిస్తూ ఉంటుంది. ప్రస్తుతం అలస్కాలోని కొన్ని పట్టణాల్లో సూర్యుడు కనిపించకుండా పోయాడు.

నవంబరు 19వ తేదీన ఈ నగరానికి సూర్యుడు టాటా చెప్పేసాడు. మళ్లీ 2021జనవరి 22వ తేదీన ఆ నగరంలోని జనాలకి సూర్యుడు కనిపిస్తాడు. అప్పటి వరకూ ఆ నగరం అంధకారంలో ఉండిపోవాల్సిందే. అయితే అలస్కాలోని చాలా పట్టణాలు ఇలా అరవై రోజుల పాటు అంధకారంలోనే ఉంటాయి. దానికి గల కారణం ఏంటంటే, భూమి అక్షం వంపుగా ఉన్న కారణంగా ఆ వంపులో ఉన్న ప్రదేశాల్లో చలికాలం సూర్యుడు కనిపించకుండా పోతాడు. ఇలాంటి పరిస్థితులని పోలార్ నైట్ అంటారు.

ఐతే సూర్యుడు రాకపోవడం వల్ల మొత్తం రాత్రిలా మారిపోతుందనుకుంటే పొరపాటే. సూర్యుడు కనిపించనప్పటికీ అక్కడ కొద్దిగా వెలుగు ఉంటుంది. సాధారణంగా సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ఉండే వెలుగు మాత్రమే ఉంటుంది. అది కూడా కొద్ది గంటలు మాత్రమే ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక్కడ ఉండే జనాలకి ప్రతీ సంవత్సరం ఇది అలవాటే అని చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news