సండే మేగ‌జీన్ : ప్రియ‌మ‌యిన మాస్టారు మ‌రో సెల‌బ్రిటీ..!

-

సెల‌బ్రిటీ అనే ప‌దం ఎప్పుడో కానీ ఊళ్లో ఉన్న‌వాళ్ల‌కు..మ‌న చుట్టూ ఉన్న వాళ్లకు వ‌ర్తించి ఉండ‌దు..కానీ ఆయ‌న ఇప్పుడొక సెల‌బ్రిటీ.. ఎందరికో స్ఫూర్తి కూడా ! ఆ వెలుగు కార‌ణంగా ఇంకొన్ని అక్ష‌ర దీపాలు వెలుగుతాయి..ఆ వెలుగు తోర‌ణాల చెంత ఇంకొన్ని జీవితాలు కొంత సంస్క‌ర‌ణ‌కు నోచుకుంటాయి. మార్పు అంటే ఇత‌రుల నుంచి నేర్చుకోద‌గ్గది అని కూడా అర్థం.

ఆ అర్థంలో జీవితం బాగుంటుంది..ఆ..అర్థంలో ప్ర‌పంచ‌మే మారి ఉంటుంది. మార్పు అంటే స్వీకారం అని ! ఎటువంటి స్వీకారం అంటే ఇత‌రుల నుంచి నేర్చుకున్న‌వి మ‌న జీవితాల‌కు అన్వ‌యం చేసుకోవ‌డమే సిస‌లు మార్పు…! ఆ..విధంగా ఈ ఆదివారం మీతోనే మీతోడే ! ఆ విధంగా డీఎస్సీ(1998)లో క్వాలిఫై అయి కొత్త జీవితం ఆరంభిస్తున్న కేదారీశ్వ‌ర‌రావు మాస్టారు కూడా
ఓ గొప్ప మార్పున‌కు ప్ర‌తీకే !

కాలచ‌క్రంలో అరుగుదల ఏమ‌యినా ఉందా.. పోనీ కాళ్ల‌లో అరుగుద‌ల‌కు ప్ర‌త్యామ్నాయం ఏమయినా ఉందా.. ? అన్నీ
ఈ త‌ర‌హాలోనే ఆలోచిస్తే..మ‌న జీవితాలే మారిపోతాయి..అందుకు త‌గ్గ ప్ర‌తిపాద‌న‌లు ఏవో మ‌నం చేయ‌గ‌లిగితే చాలు కాలం మ‌న‌కు అనుగుణంగానే ఉంటుంది. ప్ర‌తిపాద‌న, సంబంధిత కార్యాచ‌ర‌ణ అన్న‌వే ఇవాళ ముఖ్యం.. నిన్న‌టి దాకా స్థిరం అన్న‌ది లేకుండా, మ‌న‌శ్శాంతి అన్న‌ది పొంద‌కుండా నానా ఇబ్బందులూ ప‌డిన కేదారీశ్వ‌ర‌రావు మాస్టారి జీవితం ఇప్పుడు మారింది. మంచి బ‌ట్ట‌లు, మంచి భోజ‌నం దొరుకుతున్నాయి. వీటితోపాటు ఈ స‌మాజం ఆయ‌న్ను చూసే తీరు మారుతోంది.ఆ-మార్పున‌కు స్వాగ‌తం చెప్పాలి మీరు..మ‌రియు మేము..

జీవితం ఎక్క‌డో ఆగిపోతుంది..అమ్మా నాన్నా ఎవ్వ‌రూ క‌ల‌కాలం తోడుండి ఉండ‌రు..తోడు ఉండాల‌న్నా ఉండ‌లేరు..అటువంటి సంద‌ర్భాన జీవితం ఒక పాఠం నేర్పి ఉంటుంది..పాత బ‌ట్ట‌లు మార్చుకుని కొత్త దుస్తులు ధ‌రించే వేళ ఎంత ఆనందం. కాళ్ల‌కు అరిగిన చెప్పులు మార్చి ఎంత కాలం అయింది..మార్చుకుని త‌న‌ని తాను చూసుకుని ఆ మాస్టారు పొంగిపోయారు. అప్పుడు కూడా ఎంత ఆనందం.

ఆయ‌న పేరు : కేదారీశ్వ‌ర‌రావు.. జన‌సేన పిల్ల‌లు ఆయ‌న‌కు కొత్త బ‌ట్ట‌లు కొని ఇచ్చారు. 1998 డీఎస్సీలో క్వాలిఫై అయిన వారి పేర్ల‌లో ఆయ‌న ఒక‌రు. ఇన్నాళ్ల‌కు జ‌గ‌న్ సర్ వారికో గొప్ప వ‌రం ఇచ్చారు. వర‌మే ! అందుకే నిన్న‌టి వేళ వాన చినుకుల వేళ కృత‌జ్ఞ‌త అని రాశాను. ఎందుకంటే నిన్న‌టి వేళ మంత్రి ధ‌ర్మాన‌ను క‌లిసి వారంతా ఆనందించి కృత‌జ్ఞ‌త‌లు చెల్లించారు క‌నుక ! వారు అన‌గా 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ బ్యాచ్ అని ! అటువంటి వ‌రం అందుకున్న వారిలో పాత‌ప‌ట్నం మండ‌లం, పెద్ద సీది గ్రామానికి చెందిన అల్ల‌క కేదారీశ్వ‌ర‌రావు ఒక‌రు.

ఇప్పుడు వారిని ఊరంతా గొప్ప‌గా చూస్తోంది. వారితో పాటు ఇంకొంద‌రిని కూడా ఈ ప్ర‌పంచం గొప్ప‌గా చూస్తోంది.దేవుడు కొన్ని ఇచ్చి కొన్నింటిని వ‌దులుకోవాల‌ని ఆదేశిస్తాడు అని అంటారే ! అ మ్మానాన్నా కోల్పోయిన కేదారీశ్వ‌రరావుకు ఇప్పుడు ఊరు గొప్ప గొప్పగా ప్ర‌శంసిస్తోంది. చిన్న పిల్ల‌ల వైద్యులు మ‌న్మ‌థ‌రావు త‌న ఆస్ప‌త్రికి పిలిపించుకుని త‌న‌వంతుగా ఐదు వేల రూపాయ‌లు అందించి, మంచి ప్రోత్సాహం అందించారు. ఈ పాటి ప్రోత్సాహం కార‌ణంగా వారి జీవితాలు మారుతున్నాయి.

కొత్త ఆనందాలు అందుకుంటున్నాయి. ఆయ‌న్నుస‌న్మానించి, బాగా ప‌నిచేయాల‌ని కోరుతూ భుజం త‌ట్టి పంపారు. మంచి వైద్యుడు, మంచి గురువు ఏర్పాటుచేసిన ఆశ్ర‌మం నుంచే వ‌స్తాడు. మంచి గురువు అందించి క్ర‌మ‌శిక్ష‌ణ నుంచే వ‌స్తాడు. అలాంటి వారే ఈ దేశానికి కావాలి. కేదారీశ్వ‌ర‌రావుకు ఇప్పుడు గొప్ప ప్రోత్సాహం అందించిన వారంతా రేప‌టి వేళ కూడా ఇంకొందరికి బాస‌ట‌గా నిలుస్తారు..అందులో సందేహం ఏమీ లేదు.. అవ‌స‌రానికి త‌గ్గ సాయం.. ప్ర‌తిభ‌కు త‌గ్గ ప్రోత్సాహం అందించ‌డం మా బాధ్య‌త అని జ‌న‌సేన కుర్రాళ్లు అంటున్నారు. అలానే ఆ పిల్లల వైద్యులు వి.మ‌న్మ‌థ‌రావు మాట కూడా ఇదే !

– ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version