BiggBoss : సారీ చెప్ప.. ఏం చేసుకుంటావో చేస్కో పో.. సిరి పై స‌న్నీ ఫైర్‌

BiggBoss : బిగ్ బాస్ షో రోజు రోజుకి ర‌స‌వ‌త్త‌రంగా మారుతుంది. గొడవలు, కొట్లాటలు, లవ్ స్టోరీలు, రొమాంటిక్ సీన్స్‌ల‌తో రచ్చ ర‌చ్చ చేస్తున్నారు ఇంటి సభ్యులు. టైటిల్ కోసం కంటెస్టెంట్లంద‌రూ నానా హంగామా చేస్తున్నారు. దీంతో ప్ర‌తి టాస్క్ చాలా హాట్ హాట్ గా సాగిపోతుంది ఈ సీజన్ లో. కెప్టెన్సీ
టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ బొమ్మ‌ల టాస్క్ ఇచ్చారు. కంటెస్టెంట్స్ ని నాలుగు గ్రూపులుగా విడగొట్టారు. ఈ టాస్క్ లో సిరి, కాజ‌ల్ లు సంచాల‌కులుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

తొలుత ఈ టాస్క్ లో రవి టీంకి స్పెషల్ బొమ్మ రూపంలో స్పెషల్ పవర్ లభించిన విషయం తెలిసిందే. ఈ ప‌వ‌ర్ ను ఉప‌యోగించుకుని.. వారికి ఇష్టం వ‌చ్చిన టీం నుంచి బొమ్మలను స్వాధీనం చేసుకోవచ్చు. దీంతో యాంకర్ రవి త‌న విశ్వ‌రూపాన్ని చూపించాడు. ఎక్కువ బొమ్మలు తయారు చేసిన యానీ మాస్టర్‌ టీమ్ నుంచి బొమ్మల్ని లాగ్కేలారు. దీంతో ఆగ్ర‌హానికి గురైంది. అస‌హంతో యానీ మాస్టర్ ప్లాన్ మార్చింది. శ్వేత దాచిపెట్టిన బొమ్మలను లాక్కునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో శ్వేత, యానీ మాస్ట‌ర్ల మధ్య పెద్ద గొడవే జరిగింది. దీంతో హ‌నీ చాలా ఫీల్ అయ్యింది. లాస్ట్‌ టాస్క్‌లో ఫ్రెండ్‌ని కోల్పోయా.. ఈ టాస్క్‌లో బిడ్డని కోల్పోయా.. అలాంటి తొక్కల రిలేషన్‌షిప్‌ నాకొద్దంటూ క‌న్నీరు పెట్టుకుంది.

ఆ తర్వాత కన్వేయర్‌ బెల్ట్‌పై వ‌చ్చిన రా మెటీరియల్‌ తీసుకునే ప్ర‌య‌త్నం చేశారు ఇంటి స‌భ్యులు. ఈ క్రమంలో సిరికి, సన్నీకి పెద్ద గొడవ జరిగింది. ఇతర టీమ్‌కి ముందుగా నిల్చుని వాటిని తీసుకునే అవకాశం ఇచ్చారు. కానీ ఇత‌ర స‌భ్యులు ఇష్టం వ‌చ్చిన‌ట్లు లాక్కొవ‌డంతో సన్నీ మండిపడ్డాడు సంచాల‌కుల‌పై. `ఇదేందిరా భయ్.. తొక్కలో ఆట.. వాళ్లు చేయిపెడితే ఒకటి.. నేను పెడితే ఒకటా.. ఇదేం రూల్స్ ` అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

దీంతో అక్క‌డ సంచాల‌కురాలుగా ఉన్న సిరి చాలా హ‌ర్ట్ అయ్యింది. టీం స‌భ్యుల‌పై గట్టిగానే స్పందించింది. ఈ క్ర‌మంలో ఓ చిన్న‌పాటి యుద్ద‌మే జ‌రిగిందనే చెప్ప‌వ‌చ్చు. అయితే. ఆ మాట‌ల‌ను సన్నీ లెక్కచేయలేదు. `నేను అస‌లూ సారీ చెప్పా.. ఏం చేసుకుంటావో చేస్కో పో` అంటూ పవన్‌ కళ్యాణ్‌ మ్యానరిజం లో చెప్పేశాడు. దీంతో సిరి క‌న్నీరు పెట్టుకుంది.

ఈ క్రమంలో కాజల్ తన స్ట్రాటజీ గేమ్‌కి అమ‌లు ప‌రిచింది. మేం పెట్టిన రూల్‌ని అధిగమించిన కారణంగా గ్రీన్ టీం నుంచి ఒకరు ఎల్లో టీం నుంచి ఒకరు ముందు నిలబడాలంటూ కొత్త రూల్ పెట్టింది. ఈ విషయంలో ప్రియా విభేదించింది. ఆ రూల్ ని మేము ఒప్పుకోము.. అంటే సిరి ఇదే ఫైనల్ అనడంతో ప్రియకి కోపం వచ్చింది. సన్నీ మళ్ళీ సీరియస్ అయి రోజుకొక రూల్ ఎలా మారుస్తారు అని అరిచాడు.

నిన్న రూల్స్ బ్రేక్ చేస్తే అప్పుడు ఏం పీకుతున్నారు అని ప్రియా అరిచింది. దీంతో సిరి కన్నీళ్లు పెట్టుకుంది. ఇలానే మాట్లాడారా? ఒక్కొక్కరు నోరు జారుతున్నారంటూ ఆవేదన వ్య‌క్తం చేసింది. మరోవైపు సన్నీ మాత్రం సిరిని కామెంట్‌ చేస్తూ `అటు బస్సూ.. ఇటు బస్సూ ` అనే పాట పాడాడు.