ప్రధాని మోదీ సెక్యురిటీ చేతుల్లో ఉండే ఆ బ్యాగ్స్ ఎప్పుడైనా గమనించారా?..అవి బ్యాక్స్ అనుకుంటే పొరపాటే..!

-

రాజకీయనాయకులు, సినిమాళ్లు బయటకొచ్చినప్పుడు సెక్యురిటీ గట్టిగా ఉంటుంది. సినిమాళ్లకు కాస్త తక్కువేగానీ…రాజకీయ నాయకులకు ఉండే సెక్యురిటీని ఎప్పుడైనా చూశారా..ఒక్క లెవల్ కి ఒక్కో టైప్ సెక్యురిటీ ఉంటింది. వాటికి SPG,ITBP, CRPF, CISF అని వివిధ పేర్లు ఉంటాయి. వాళ్లు ఎక్కడికి వెళ్లినా సెక్యురిటీ కచ్చితంగా ఉంటుంది. అయితే ఈరోజు ప్రధానిమోదికి ఉండే సెక్యురిటీ గురించి చూద్దాం.

ప్రధాని మోదికి కూడా చుట్టూ టైట్ సెక్యురిటీ ఉంటుంది. మోది ఎక్కడికి వెళ్లినా చుట్టుపక్కల కొంత దూరం వరకు జనాలు సంచరించకుండా ఉంటారు. కొన్ని సందర్భాల్లో అయితే అసలు మోదీని చూడడానికి వీలు లేకుండా ఆ ఎస్పీజీ కమాండోస్ జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే మీరు ఎప్పుడైనా ఒక విషయం గమనించారా? మోదీ చుట్టూ ఉన్న ఎస్పీజీ కమాండోస్ చేతులలో కొన్ని బ్యాగ్స్ ఉంటాయి. ఆ బ్యాగ్ లో డాక్యుమెంట్స్ ఉంటాయి ఏమో అనుకుంటాం…కానీ మీరు అనుకున్నట్లు అందులో ఏ డ్యాంకుమెంట్స్ యో పేపర్స్ యో ఉండవు. వాటిని పోర్టబుల్ బులెట్ ప్రూఫ్ షీల్డ్ అని అంటారు. అంటే అది బ్యాగ్ లాగా కనిపించే ఒక బులెట్ ప్రూఫ్ షీల్డ్.

ఏదైనా ప్రమాదం ఉన్నట్లు అనిపిస్తే, ఆ బ్యాగ్ నిలువుగా తెరిచి, ఎస్పీజీ కమాండోస్ మోడీ చుట్టూ ఆ బ్యాగ్స్ తో గోడ లాగా కట్టేస్తారట.. దాంతో ఆ చుట్టుపక్కల ఏమైనా ప్రమాదం జరిగినప్పుడు దాని నుండి మోదీని రక్షించవచ్చు. చూడటానికి ఇంత చిన్న బ్యాగ్స్ లాగానే అనిపిస్తాయి. కానీ అందులో ఇంత మీనింగ్ ఉందనమాట. ఈ సారి ఎప్పుడైనా టీవీలో వచ్చినప్పుడు బాగా చూడండి.

రాజకీయ నాయకులు సెక్యురిటీ లేకుండా ఎక్కడికి వెళ్లరు. ఎందుకంటే ఏ క్షణం ఎవరైనా యాటాక్ చేయొచ్చు.. అప్పటికప్పుడు వాళ్లబారినుండి ఈ కమాండోస్ యే కాపడతారు. అందుకే వారు ఎంత క్రౌడ్ ఉన్నా వారి డ్యూటీ వారు చేస్తారు. చాలా సందర్భాల్లో వీళ్లకు, ప్రజలకు మధ్య తోపులాట కూడా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా సినిమా వాళ్లకుండే సెక్యురిటీకి బాగా జరుగుతుంటాయ్.

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news