బట్టలు ఊడదీసి…గుండు కొట్టిస్తాం : గువ్వల బాల్ రాజ్‌ కు కాంగ్రెస్ వార్నింగ్

రేవంత్‌ రెడ్డిపై నిన్న గువ్వల బాల్‌ రాజ్‌ చేసిన వ్యాఖ్యలకు పిసిసి అధికార ప్రతినిధి సుధీర్ రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. . రేవంత్ రెడ్డి కను సైగ చేస్తే బట్టలు ఊడదీసి… గుండు కొట్టిస్తామని హెచ్చరించారు సుధీర్‌ రెడ్డి. దళిత కార్డు అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోమని..బట్టలు ఊడదీసి కొడతాడు అంటా… నీకు దమ్ముంటే రా అంటూ సవాల్‌ విసిరారు.

శ్రీకాంత్ చారి కుటుంబం కి అన్యాయం చేసిన ద్రోహులు టీఆర్‌ఎస్‌ నాయకులని ఫైర్‌ అయ్యారు. అదృష్టం కొద్దీ రెండో సారీ గెలిచావని.. అచ్చంపేట కు రమ్మంటవా…? అంటూ ఫైర్‌ అయ్యారు. నువ్వు గువ్వల బాలరాజు వా… బానిస బాలరాజు వా..? అంటూ ఎద్దేవా చేశారు. పాలమూరు సభ సక్సెస్ అవ్వడం చూసి కెసిఆర్ చెడ్డి గ్యాంగ్ ఓర్వలేక పోయిందని నిప్పులు చెరిగారు. గువ్వల బాలరాజు కి ఏం మాట్లాడాలో తెలియని మూర్ఖుడని మండిపడ్డారు. మంత్రి నిరంజన్ రెడ్డీ పగటి వేషాలు మానుకోవాలని… దోతీ కట్టినంత మాత్రాన రైతువు కావంటూ చురకలు అంటించారు.