కరోనా వైరస్ కారణంగా దేశంలో అందరు చాలా నష్టాలలో ఇరుక్కుపోయారు.దేశం కూడా ఆర్థికంగా చాలా దెబ్బతిన్నది. చాలా మంది ఉపాధి కోల్పోయి చాలా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. అలాగే చాలా మందికి ఉద్యోగాలు కూడా పోయాయి. అలాంటి వాళ్ళ కోసం ఒక గొప్ప అద్భుతమైన బిసినెస్ ఆఫర్ గూర్చి తెలుసుకోండి. మీరు పెద్ద కష్ట పడాల్సిన అవసరం లేదు. ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే చాలు ఏకంగా రూ.60 లక్షలు సంపాదించే ఛాన్స్ ఉంది. అయితే దీనికి 10 నుంచి 15 ఏళ్లు వేచి చూడాలి.
న్యూఅది ఎలా అంటే తెల్ల గంధపు చెట్లను పెంచడం ద్వారా కళ్లుచెదిరే లాభాన్ని పొందొచ్చు. తెల్ల గంధపు చెట్టులను మెడిసినల్ ట్రీగా చెప్పుకోవచ్చు. దీని నుంచి వచ్చే చెక్క, ఆయిల్ను ఔషధాలు, సబ్బులు వంటి వాటి తయారీకి ఉపయోగిస్తారు. అందువల్ల తెల్ల గంధపు చెక్కకు డిమాండ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది.అయితే కొంతమంది ఈ గంధపు చెట్లను పెంచడానికి భయపడతారు.కానీ గంధపు చెట్లను పెంచడం తప్పేమీ కాదు.
అయితే దీని కోసం మీరు ప్రభుత్వం నుంచి ముందుగానే అనుమతి తీసుకోవాలి.అనుమతి వచ్చాకనే గంధపు చెట్లను పెంచుకోవాలి. తెల్ల గంధపు చెక్క పెరగడానికి 10 నుంచి 15 ఏళ్లు పడుతుంది. ఇతర మొక్కల కన్నా గంధపు మొక్కల ధర ఎక్కువగా ఉంటుంది. అయితే మీకు ఎక్కువ గంధపు మొక్కలను కొనుగోలు చేస్తే మీకు ఒక్క మొక్క రూ.400 రావొచ్చు. ఒక చెట్టు నుంచి 8 నుంచి 10 కేజీల చెక్కను తీసుకోవచ్చు. ఒక్క కేజీ ధర రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు ఉంటుంది.
విదేశాల్లో అయితే రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు లభిస్తుంది. అంటే ఈ లెక్కన ఒక ఎకరానికి 60 లక్షలు సంపాదించవచ్చు అన్నమాట.. కానీ ఎత్తలేదనుకున్న ఈ చెట్లు పెరగడానికి ఒక 15 సంవత్సరాల సమయం పడుతుంది. కానీ తరువాత లాభం మాత్రం బాగా వస్తుంది..