పుష్ప సినిమా నుంచి తప్పుకున్న విజయ్ సేతుపతి.. ఎందుకంటే !

-

సుకుమార్ దర్శకత్వంలో అల్లుఅర్జున్ పుష్ప చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే చిత్రంలో మొదట విజయ్ సేతుపతిని కీలక పాత్ర కోసం ఎంపిక చేయడం జరిగింది. ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాకుండానే విజయ్ సేతుపతి సినిమా నుండి తప్పుకున్నాడు. పుష్ప నుండి విజయ్ సేతుపతి తప్పుకోవడంకు పలు కారణాలు వినిపించాయి. అయితే అసలు కారణం ఏంటీ అనేది తాజాగా ఆయనే ఒక తమిళ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశారు.

pushpa
pushpa

అయితే పుష్ప చిత్రంలోని ఆ పాత్రను చాలా ఇష్టంతో ఒప్పుకున్నాను. కాని సినిమా షూటింగ్ కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవ్వడంతో డేట్లు ఇబ్బందిగా మారాయని విజయ్ తెలిపారు. పుష్పకు ముందు తర్వాత కమిట్ అయిన సినిమాల కారణంగా సుకుమార్ అడిగే డేట్లు ఇవ్వడం కష్టం అవుతుందనే ఉద్దేశ్యంతో నేను పుష్ప నుండి తప్పుకున్నానని తెలియజేశారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయిన తర్వాత డేట్లు కుదరకపోతే ఇబ్బంది పడే అవకాశం ఉందని తెలిపారు. పుష్ప టీం మెంబర్స్ ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. అందుకే నేను ఆ చిత్రం నుండి అయిష్టంగానే తప్పుకున్నట్లుగా విజయ్ సేతుపతి ఈ సందర్బంగా తెలియజేశారు.

అయితే ఉప్పెన చిత్రంలో కీలక పాత్రలో నటించిన విజయ్ ఒక డైరెక్ట్ తెలుగు సినిమాను కూడా చేసేందుకు కమిట్ అయినట్లుగా సమాచారం అందుతోంది. అది కూడా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లోనే ఉంటుందని టాక్. ఆ సినిమా కారణంగానే విజయ్ సేతుపతి పుష్ప చిత్రం నుండి తప్పుకుని ఉంటాడని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాని విజయ్ సేతుపతి మాత్రం ఇతర సినిమాలకు కమిట్ అవ్వడం వల్ల పుష్పను ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశ్యంతో తప్పుకున్నట్లుగా ఈ సందర్భాంగా తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news