సూపర్ స్టార్ మహేష్ బాబు సరికొత్త కారును కొన్నాడు. లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ ను కొనుగోలు చేశారు. తను ఆడి ఇ-ట్రాన్ కారును కొనుగోలు చేసినట్లు ఇన్ స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ఆడి నుంచి వచ్చిన ఇ-ట్రాన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ధర రూ. 1.14 కోట్ల కంటే ఎక్కువే. అధునాతన ఫీచర్లు ఈ కార్ సొంతం. మహేష్ బాబు తన అవసరాలకు అనుగుణంగా కార్ ను డిజైన్ చేయించుకున్నారు. ఇన్ స్టా గ్రామ్ ద్వారా మహేష్ బాబు ఈ విషయాన్ని తెలియజేశారు. కార్ ఫోటోలను ఇన్ స్టాలో షేర్ చేయగా 85 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. ఈ ఫోటోను షేర్ చేస్తూ… క్లీన్, గ్రీన్ భవిష్యత్తును ఇంటికి తీసుకువచ్చామని… ఆడి ఎక్స్ పీరియన్స్ కోసం ఎదురు చూస్తున్నాం (Bringing a clean, green and sustainable future home.
Excited for the #Audi Experience) అంటూ కామెంట్ చేశారు.
లగ్జరీ ఫీచర్లతో ఈ కార్ ని తయారు చేశారు. యాంబియంట్ లైటింగ్ ప్యాకేజీ ప్లస్, ఎయిర్ క్వాలిటీ ప్యాకేజీ, బ్యాంగ్ & ఒలుఫ్‌సెన్ 3D ప్రీమియం సౌండ్ సిస్టమ్, టాప్ వ్యూతో 360 డిగ్రీ కెమెరాలు, డైనమిక్ లైట్ స్టేజింగ్‌తో కూడిన డిజిటల్ మ్యాట్రిక్స్ LED హెడ్‌ల్యాంప్‌లు, 4 జోన్ క్లైమేట్ కంట్రోల్ మరియు పనోరమిక్ గ్లాస్ సన్‌రోఫ్ వంటి అనునాతన ఫీచర్లు ఈ ఇ-ట్రాన్ సొంతం. ఆడి ఇ-ట్రాన్ 95 kwh బ్యాటరీ ప్యాక్ తోె వస్తోంది. కార్ 402 HP పవర్ అవుట్‌పుట్ తో పాటు గరిష్టంగా 664 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5.5 సెకన్లలో 0-100 కి.మీ వేగాన్ని అందుకోగలదు. గరిష్టంగా గంటకు 200 కి.మీ. వేగంతో కార్ ప్రయాణిస్తుంది.