సూపర్ స్టార్ మహేష్ బాబుకు సర్జరీ..

మహేష్ బాబుకు తాజాగా మోకాలి శస్త్రచికిత్స జరిగింది. స్పెయిన్ లో మోకాలికి ఆపరేషన్ జరిగింది. ప్రస్తుతం దుబాయ్ లో మహేష్ బాబు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయనతో పాటు ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్ కూడా ఆయన వెంట ఉన్నట్లు తెలుస్తోంది.

మహేష్ బాబు అభిమానుల్లో .. తమ హీరో ఆరోగ్యంపై కాస్త ఆందోళన నెలకొంది. ప్రస్తుతం సర్కారి వారి పాట సినిమాలో మహేష్ బాబు నటిస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా ఈ మూవీ రూపొందుతోంది. ఫిబ్రవరి నుంచి షూటింగ్ లో మళ్లీ మహేష్ బాబు పాల్గొనవచ్చని తెలుస్తోంది.  ఇటీవల ఎవరు మీలో కోటీశ్వరుడు షోకు హాజరైన మహేష్ సినిమా గురించి ఎన్టీఆర్ తో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.