దర్యాప్తు సంస్థలపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు

-

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. దర్యాప్తు సంస్థలు అసలు విషయాన్ని వదలి కొసరు విషయాలపై దృష్టి పెడుతున్నాయని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

ఈ క్రమంలో సీబీఐపై కేసుల భారం పెరుగుతోందని తెలిపారు. దేశ రక్షణ, ఆర్థిక స్కామ్‌లపై కాకుండా ఇతర కేసులపై దృష్టి పెడుతున్నారని ఆయన విమర్శించారు. మరోవైపు ఇవాళ ఉత్తర ప్రదేశ్ లోని జ్ఞానవాపి మసీదు కేసులో చంద్రచూడ్ కీలక తీర్పు వెలువరించారు. జ్ఞానవాపి మసీదు సముదాయంలోని వ్యాస్ బేస్‌మెంట్‌లో పూజలు చేసుకుంటామని హిందూ భక్తులు తెలపగా దానికి వ్యతిరేకంగా మసీదు కమిటీ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఇవాళ విచారించింది.

ఇరువైపుల వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి.. ప్రస్తుతానికి రెండు వర్గాల ప్రార్థనలు యథావిధిగా కొనసాగించుకోవచ్చని పేర్కొన్నారు. మసీదు దక్షిణ నేలమాళిగలో హిందువులు పూజలు చేసుకోవడానికి దిగువ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ ఆదేశాలను అలహాబాద్ హైకోర్టు కూడా సమర్థించింది.

Read more RELATED
Recommended to you

Latest news