గుజరాత్ గోద్రా రైలు దహనం అనంతరం జరిగిన అల్లర్ల కేసు నుంచి ప్రధాని నరేంద్ర మోడీకి విముక్తి లభించింది. దీనిపై దర్యాప్తు చేసిన జస్టిస్ నానావతి- మెహెతా కమిషన్ ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ నివేదికను బుధవారం గుజరాత్ మంత్రి ప్రదీప్ సింగ్ జడేజా నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. గోద్రా అల్లర్ల తర్వాత జరిగిన పరిణామాలతో అప్పటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని నివేదిక స్పష్టం చేసింది.
అప్పట్లో సబర్మతి ఎక్స్ప్రెస్ రైలు దహనం తర్వాత ఘటనా స్థలాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి నరేంద్రమోడీ.. ఎస్-6 కోచ్ లో సాక్ష్యాలను మాయం చేసేందుకు ప్రయత్నించారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. అయితే దీన్ని నిరాధారమైన ఆరోపణలు గా జస్టిస్ నేనావతి -మెహెతా మిషన్ నిర్ధారించింది. అంతే కాదు ఎవరికీ సమాచారం ఇవ్వకుండా ఘటనా స్థలానికి వెళ్లారన్న ఆరోపణలను కమిషన్ తోసిపుచ్చింది. అయితే జస్టిస్ నానావతి -మెహెతా కమిషన్ నివేదిక ఇచ్చిన ఐదేళ్ల తర్వాత నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టడం గమనార్హం.