సుప్రీం కోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆరు శాతం వడ్డీ చెల్లించమంది…!

-

ఉద్యోగులకి జీతం మరియు పెన్షన్ సరిగ్గా ఇవ్వాలి అని సుప్రీం కోర్టు చెప్పింది. ఆలస్యానికి బదులుగా ఇంట్రెస్ట్ ఇవ్వాలని అంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆరు శాతం ఇంట్రెస్ట్ ఇవ్వాలి అని కోర్టు ఆదేశించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గవర్నమెంట్ ఉద్యోగస్తులకి జీతాన్ని మరియు పెన్షన్ ని ఆలస్యం చేసింది. మార్చి, ఏప్రిల్ కరోనా సమయంలో ఇలా చేయడం జరిగింది. కానీ తర్వాత ఏప్రిల్లో ప్రభుత్వ మెడికల్, హెల్త్, పోలీస్ మరియు శానిటేషన్ వర్కర్స్ కి జీతాన్ని చెల్లించేసింది. పెన్షన్ ని కూడా రిజిస్టర్ చేసేసింది. ఇది 26 ఏప్రిల్ జరిగింది. కానీ జెడ్జ్ హైకోర్టు లో పిటిషన్ వేశారు. దానిలో ఆయన శాలరీ మరియు పెన్షన్ పొందడం ఎంప్లాయ్ హక్కు అని చెప్పడం జరిగింది.

హైకోర్టు ఏం చెప్పిందంటే జీతాలు రావడం అనేది ఆర్టికల్ 21(Right to life) మరియు ఆర్టికల్ 370A (Right to property) కి వస్తుంది. హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని 12 శాతం ఇంట్రెస్ట్ కట్టాలంది. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తో జీతాలు మరియు పెన్షన్ ని ఆలస్యం చేయడానికి కారణం ఆర్థిక సంక్షోభం అని చెప్పింది. ఈ ఆర్డర్ వచ్చిన వెంటనే ఫ్రంట్లైన్ వర్కర్స్ కి జీతాలు ఇవ్వడం జరిగింది అని చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ఇంట్రెస్ట్ పే చేయడం అనేది సరైనది కాదు అని కూడా చెప్పింది.

ఫిబ్రవరి 8న డీవై చంద్ర చాడ్ మరియు షా పేమెంట్ ఆర్డర్ లో ఎటువంటి తప్పు లేదన్నారు. రూల్ ఆఫ్ లా ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి జీతాన్ని లేదా పెన్షన్ పొందడం హక్కు. ఉద్యోగులు లాయర్ ఏమన్నారంటే 12 శాతం వడ్డీ చెల్లించాలి అని అన్నారు. సుప్రీం కోర్ట్ ఈ వడ్డీ చెల్లిస్తే గవర్నమెంట్ కి పనిష్మెంట్ విధించినట్లు కాదు. సరైన మొత్తాన్ని చెల్లించాలి అని చెప్పింది. ఈ మేరకు ఆరు శాతం ఇంట్రెస్ట్ ని పేమెంట్ ఆలస్యానికి కారణంగా చెల్లించాలని చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news