ఈ మధ్య సోషల్ మీడియాలో మీమ్స్‌తో అదరగొడుతూ నైజీరియా బుడ్డోడు తెగ ఫేమస్ అయ్యాడు. ఎలాంటి సంఘటనకైనా అతని ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ భలే సెట్ అవుతాయ్.. మనకు బ్రహ్మానందం, తమిళంలో వడివేలు ఎలాగో నైజీరియాలో ఈ బుడ్డోడు అలా. ప్రతి భాషలో కమెడియన్లు తమ తమ అభిమానులను అలరిస్తుంటారు. మన మూడ్ ను మార్చేస్తూ.. వర్క్ ప్రెషర్‌ను తగ్గిస్తారు ఈ కమెడీయన్స్. అలాగే సోషల్ మీడియాలో చిన్న చిన్న వీడియోస్‌తో ఈ నైజిరియా బుడ్డొడు ఎక్స్‌ప్రెషన్స్‌తో అందరినీ బాగా నవ్విస్తున్నాడు. అయితే ఈ బుడ్డోడు చూడటానికి 12 ఏళ్ల వయసున్నోడిలా కనిపిస్తుంటాడు.. కానీ నిజానికి ఇతడి వయసు 38 సంవత్సరాలు. ఇతని కథ వేరే ఉంది అదేంటో తెలుసుకుందాం..
ఈ మీమ్స్ కింగ్ పేరు ఒసిటా ఇహెమ్.. 1982 ఫిబ్రవరి 20న నైజీరియాలోని ఇమో స్టేట్‌లోని ఎంబైటోలిలో జన్మించాడు. పెరిగిందంతా అబియా స్టేట్‌లోనే. లాగోస్ స్టేట్ యూనివర్సిటీలో కంప్యూటర్స్ సైన్స్‌లో డిగ్రీ పూర్తి చేశాడు. కొందరికి అంగవైకల్యం శాపంగా మారుతుంది.. మరికొందరికి అదే వరంగా మారుతుంది.. అలాగే ఈ ఒసిటాకు పొట్టిగా ఉండటమే ప్లస్ అయ్యింది. ఒసిటా యాక్టింగ్‌లో మొదట చాలానే కష్టపడ్డాడట. 2003లో తొలిసారిగా కమెడీయన్‌గా నటించాడు. ఆ సినిమాలో పావ్ పా పాత్ర పోషించి అంటే మన భాషలో చెప్పాలంటే తీట పిల్లాడి పాత్ర అన్నమాట.. ఈ పాత్ర బాగా ఫేమస్ అవటంతో ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో చిన్నపిల్లాడి పాత్రే పోషించాడు.
నైజీరియా ప్రముఖ నటుడిగా పేరుపొందిన ఒసిటా ఇహెమ్‌ను ఎన్నో అవార్డులు వరించాయి. 2011లో నైజీరియాలో ప్రముఖమైన ‘‘ఆర్డర్ ఆఫ్ ది ఫెడరల్ రిపబ్లిక్ పురస్కారం’’తో అధ్యక్షుడు గుడ్‌లక్ జోనాథన్ సత్కరించారు. ఒసిటా ఆఫ్రికన్ మూవీ అకాడమీ అవార్డులలో ఇహేమ్ లైఫ్ టైం ఎఛీవ్మెంట్ అవార్డు అందుకున్నాడు. ఇప్పుడదే వరల్డ్ వైడ్ వైరల్ అవుతోంది. హాస్యనటుడిగా ఎంతో పేరుపొందిన ఒసిటా ‘INSPIRED 101’ అనే పుస్తకాన్ని రాశాడు. నల్లగా పుట్టాం, పొట్టిగా ఉన్నాం.. అని తెగ బాధపడిపోయే వాళ్లకు ఇతడి జీవితం ఇన్సిపిరేషన్ అవుతుందడనంలో సందేహం లేదు.