అగ్రిగోల్డ్‌ కేసులో హైకోర్టు ఆదేశాలపై సుప్రీం ఏం చెప్పిందంటే..?

-

అగ్రిగోల్డ్‌ కేసులో తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో అగ్రిగోల్డ్ డిపాజిటర్ల సంఘం పిటిషన్ వేసింది. 32 లక్షల మంది డిపాజిటర్లు ఉన్నారని సుప్రీంకోర్టుకు పిటిషనర్‌ తెలిపారు. రూ.6,640 కోట్ల కుంభకోణమని సుప్రీంకోర్టుకు పిటిషనర్‌ వెల్లడించారు. హైకోర్టు కొన్ని ఆస్తులు వేలం వేసి రూ.50 కోట్లే రాబట్టిందని సుప్రీంకోర్టుకు పిటిషనర్‌ తెలిపారు. తదుపరి కేసును ఏలూరు ప్రత్యేక కోర్టుకు బదిలీ చేసిందని వివరించారు.

పిటిషనర్ వాదనలు విన్న సుప్రీం కోర్టు.. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది.  ఏలూరు కోర్టుకు వెళ్లాలని డిపాజిటర్లకు సూచించింది. తెలంగాణ అగ్రిగోల్డ్‌ డిపాజిటర్ల సంఘం పిటిషన్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news