నవనీత్‌ కౌర్‌కు సుప్రీం కోర్టులో భారీ ఊరట!

-

అమరావతి ఎంపీ నవనీత్ కౌర్‌కు బాంబే హైకోర్టు ఇటీవల షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఆమె ఎస్సీ కులం సర్టిఫికెట్‌ను రద్దు చేసిన బాంబే హైకోర్టు… రూ. 2 లక్షలు జరిమానా కూడా విధించింది. ఎన్నికల సమయంలో నవనీత్ కౌర్ తప్పుడు సర్టిఫికెట్ సమర్పించారని శివసేన నేత బాంబే హైకోర్టులో పిటిషన్ పై ఈ తీర్పు ఇచ్చింది. అయితే ఈ విషయంలో ఎంపీ నవనీత్ కౌర్‌కు భారీ ఊరట లభించింది. ఎంపీ నవనీత్ కౌర్ విషయంలో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీమ్ కోర్టు తలుపుతట్టింది. దీంతో నవనీత్ కౌర్ కు కొంత ఊరట లభించింది. ముంబై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీమ్ కోర్ట్ స్టే ఇచ్చింది.

నవనీత్ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గి… మోచి, చమార్ రెండు సమానార్థాలు కలిగిన పదాలే అని ఆమె ఎస్.సి. కి చెందిన వ్యక్తే నని, అయితే ముంబై హైకోర్ట్ తాము దాఖలు చేసిన పత్రాలను పరిశీలిం చకుండా తీర్పు ఇచ్చిందని వాదించారు. దీన్ని కపిల్ సిబాల్ ఖండించారు. అయితే సుప్రీమ్ కోర్ట్ కౌంటర్ అఫిడవిట్ వేయామని సిబాల్ ను కోరింది. అలాగే కుల ధ్రువీకరణ పత్రం వ్యవహారం పై ఫిర్యాదు చేసిన వ్యక్తి తో పాటు మరికొందరికీ సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. మొత్తం మీద వెకేషన్ బెంచ్ లోని న్యాయమూర్తులు జస్టీస్ వినీత్ శరన్, దినేష్ మహేశ్వరి ఇచ్చిన స్టే ఆర్డర్ నవనీత్ కౌర్ కు కాస్తంత ఓదార్పును కలిగించిందనే భావించాలి.

Read more RELATED
Recommended to you

Latest news