తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై వ్యవహారంపై తెలంగాణ సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. పది బిల్లులను గవర్నర్ తమిళసై ఆమోదించకపోవడం పై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. బిల్లులను గవర్నర్ ఆమోదించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ వ్యవహారంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
ఈ అంశంలో గవర్నర్ కు నోటీసులు ఇవ్వాలన్న తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. నోటీసులు ఇచ్చేందుకు సుప్రీం కోర్ట్ నిరాకరించింది. అలాంటి నోటీసులు ఇవ్వలేమని తెలిపింది. దీనిపై అభిప్రాయం తెలియజేయాలని కేంద్రాన్ని సుప్రీం ఆదేశించింది. తదుపరి విచారణని ఈనెల 27 కు వాయిదా వేసింది. ఆ లోపు పెండింగ్ బిల్లులు పాస్ అవుతాయేమోనని అనుమానం వ్యక్తం చేశారు సొలిసిటర్ జనరల్.