బిజెపి ప్రభుత్వంలో వ్యవసాయం కుప్పకూలింది – కోదండ రెడ్డి

-

బీజేపీ ప్రభుత్వం లో వ్యవసాయం కుప్పకూలిందని ఆరోపించారు కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి. రైతులకు బరోసా ఇచ్చేందుకు 12హామీలను రాయ్ పూర్ డిక్లరేషన్ లో కాంగ్రెస్ ప్రకటించిందన్నారు. ఎమ్మెస్పీ పై ఇంతవరకు బీజేపీ ప్రభుత్వం హామీ ఇవ్వలేదని.. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎమ్మెస్పీ ఇస్తామని హామీ ఇచ్చిందన్నారు. ఫసల్ భీమా యోజన నిరుపయోగంగా మారిందని మండిపడ్డారు. కాంగ్రెస్ రైతులకు ఇచ్చిన హామీలు ప్రతీ గ్రామానికి తీసుకెళ్తామన్నారు.

అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టాన్ని వ్యవసాయ ,రెవెన్యూ శాఖలు కలసి అంచనా వేయాలన్నారు. అలాగే రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ.. అకాల వర్షాల వల్ల తీవ్రంగా రైతులు నష్టపోయారని తెలిపారు. దాదాపు12,13 వందల కోట్ల నష్టం జరిగిందన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి పై మాకు నమ్మకం లేదని.. గతంలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలో అకాల వర్షాలు పడిన ప్రాంతాన్ని వ్యవసాయ శాఖ మంత్రి పరిశీలించినా రూపాయి నష్ట పరిహారం ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో పంట నష్టపరిహారం గత 9 ఏళ్ళలో ఎప్పుడు ఇవ్వలేదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news