శబరిమల ఆలయంలోకి 10 నుంచి 50 సంవత్సరాల వయస్సుగల మహిళల అనుమతిస్తూ ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలనే పిటీషన్ పై సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఈ విషయంలో దాఖలైన పలు రివ్యూ పిటిషన్లపై జనవరి 22న బహిరంగ కోర్టులో విచారణ చేపట్టడానికి సుప్రీం అంగీకరించింది. గత రెండు నెలల క్రితం సెప్టెంబరు 28న కోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా దాఖలైన రివ్యూ పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్, ఆర్.ఎఫ్.నారిమన్, ఎ.ఎం.ఖాన్‌విల్కర్, డి.వై.చంద్రచూడ్, ఇందు మల్హోత్రాలతో కూడిన బెంచ్ ‘ఇన్ ఛాంబర్’లో విచారణ చేపట్టనుంది. తీర్పును సమీక్షించాలని కోరుతూ ఏకంగా 48పిటిషన్లు దాఖలయ్యాయి. రివ్యూ పిటిషన్లపై నిర్ణయం తీసుకున్న తర్వాతనే తాజా పిటిషన్లపై విచారణ చేపడతామని కోర్టు స్పష్టం చేసింది.