వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై విశాఖ ఎయిర్ పోర్ట్ లో జరిగిన హత్యాయత్నానికి సంబంధించిన వివరాలను వైసీపీ నేతలు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు వివరించారు. దాడి అనంతరం ఏపీ ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని వారు ప్రధానంగా రాష్ట్రపతికి తెలిపారు. ఈ ఘటనపై నిష్పపాక్షిక విచారణ జరగాలంటే.. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఏజెన్సీతో విచారణ జరిపించాలని కోరారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు మాట్లాడుతూ.. రాష్ట్రపతి తన అభ్యర్థనపై సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు.
వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి, వరప్రసాద్, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.