న్యూఢిల్లీ: జార్ఖండ్ జడ్జి హత్యపై సుప్రీం కోర్టు జడ్జి ఎన్వీరమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. జడ్జి హత్య కేసును సుప్రీంకోర్టులో సుమోటోగా విచారణ చేపట్టారు. ఈ కేసుపై పూర్తి దర్యాప్తు చేయాలని సీబీఐకి నోటీసులు జారీ చేశారు. ఫిర్యాదు చేసినా పోలీసులు, సీబీఐ స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జార్ఖండ్ జడ్జి హత్య వ్యవహారమే ఓ ఉదాహరణ అన్నారు. అనుకూలంగా తీర్పు రాకపోవతే న్యాయవ్యవస్థను కించపరచ్చడం బాధాకరమన్నారు. న్యాయ మూర్తులకు ఫిర్యాదు చేసే స్వేచ్ఛకూడా లేదన్నారు. గనుల మాఫియా ఉన్న ప్రాంతంలో జడ్జిలకు, వారి నివాస ప్రాంతాలకు పూర్తి రక్షణ కల్పించాలని ఆదేశించారు.
న్యాయవ్యవస్థలో దాడులకు గురైన న్యాయమూర్తుల జాబితా తన వద్ద ఉందని పేర్కొన్నారు. జడ్జి హత్య ప్రభుత్వ వైఫల్యమేనని ఆయన వ్యాఖ్యానించారు. జడ్జి హత్యపై వారంలోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ఇటీవలే జార్ఖండ్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ కేసును సీబీఐకు నివేదించామని అడ్వకేట్ జనరల్ తెలిపారు. ఈ కేసులో సోమవారం సీబీఐ కోర్టు ముందు కావాలని ఆదేశించారు. జడ్జిల రక్షణకు చేపట్టిన చర్యల వివరాలు ఇవ్వాలని రాష్ట్రాలకు ఎన్వీరమణ నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణను ఆగస్టు 17కు వాయిదా వేశారు