రాజీవ్ ఖేల్ రత్న అవార్డ్ పేరు మార్చిన కేంద్రం…

-

కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో అత్యుత్తమ అవార్డు అయిన రాజీవ్ ఖేల్ రత్న అవార్డ్ పేరును కేంద్ర ప్రభుత్వం మార్చేసింది. ఇకపై మేజర్ ధ్యానచంద్ ఖేల్ రత్న పేరుతో.. ఈ అవార్డులను బహుకరించనుంది కేంద్ర ప్రభుత్వం. ఎన్నో రోజులు నుంచి పౌరుల నుంచి డిమాండ్‌ కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం.

ఈ మేరకు తన ట్విట్టర్ వేదికగా ప్రధాని మోదీ ప్రకటించారు. “ఖేల్ రత్న అవార్డుకు మేజర్ ధ్యాన్ చంద్ పేరు పెట్టాలని నేను భారతదేశవ్యాప్తంగా పౌరుల నుండి అనేక అభ్యర్ధనలు వచ్చాయి. వారి అభిప్రాయాలకు నేను వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వారి మనోభావాలను గౌరవిస్తూ, ఖేల్ రత్న అవార్డును ఇక నుంచి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అని మార్చుతున్నాం. మేజర్ ధ్యాన్ చంద్ భారతదేశంలో అగ్రగామి క్రీడాకారులలో ఒకరు, భారతదేశానికి గౌరవం మరియు గర్వం తెచ్చారు. మన దేశ అత్యున్నత క్రీడా గౌరవం అతని పేరు మీద పెట్టడం సముచితం.”అంటూ ప్రధాని మోడీ ట్వీట్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news