వ‌ర్షాకాలం జ‌ర‌భ‌ద్రం సుమా.. విద్యుత్ స్తంభాన్ని పట్టుకుని యువతి మృతి.. వీడియో..!

-

వర్షాకాలం రోడ్డుపై వెళ్లేటప్పుడు పక్కనే ఉండే కరెంటు స్తంభాలను చూసుకుని నడవాలి. పొరపాటున వాటికి తాకితే ఇక అంతే సంగతులు. కరెంట్ షాక్‌తో ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది.

ప్రతి ఏడులాగే ఈసారి కూడా వర్షాకాలం వచ్చేసింది. కాకపోతే కొంత ఆలస్యంగా వర్షాలు పడుతున్నాయి. అయితే వర్షాకాలం ఏమోగానీ ఈ సీజన్‌లో అన్ని అంశాల పరంగా చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. లేదంటే ప్రాణాల మీదకు వస్తుంది. ముఖ్యంగా రోడ్డుపై వెళ్లేటప్పుడు పక్కనే ఉండే కరెంటు స్తంభాలను చూసుకుని నడవాలి. పొరపాటున వాటికి తాకితే ఇక అంతే సంగతులు. కరెంట్ షాక్‌తో ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. సూరత్‌ ప్రాంతానికి చెందిన ఓ యువతి సరిగ్గా ఇలాగే మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే…

గుజరాత్‌లోని సూరత్‌లో నివాసం ఉండే కాజల్ (20) స్థానికంగా ఉన్న ఓ నేత పరిశ్రమలో పనిచేస్తూ కుటుంబ భారం మోస్తోంది. అయితే ఈ నెల 28వ తేదీన శుక్రవారం యథావిధిగా పనికి వెళ్లిన కాజల్ మధ్యాహ్నం భోజనం కోసం ఇంటికి బయల్దేరింది. అయితే వర్షం కురుస్తుండడంతో రహదారి అంతా చిత్తడిగా మారింది. ఈ క్రమంలో ఆమె గుంతలను తప్పించుకుంటూ రోడ్డుపై నడుస్తోంది. అయితే మార్గమధ్యలో ఒక చోట గుంతను తప్పించుకుని ముందుకు వచ్చిన కాజల్ పక్కనే ఉన్న కరెంటు స్తంభాన్ని అనుకోకుండా పట్టుకుంది. దీంతో ఆమెకు కరెంట్ షాక్ కొట్టి అక్కడికక్కడే మృతి చెందింది.

అయితే ఆ యువతి అలా కరెంటు షాక్ బారిన పడి చనిపోయిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ క్రమంలో ఆ వీడియో కాస్తా ఇప్పుడు నెట్‌లో వైరల్ అవుతోంది. అయితే కాజల్‌కు ముందు చాలా మంది అదే కరెంటు స్తంభానికి సమీపం నుంచి వెళ్లారు. అయినా వారు దాన్ని ముట్టుకోలేదు. కానీ కాజల్ దురదృష్టం.. అనుకోకుండా ఆ పోల్‌ను టచ్ చేయడంతో ఆమె ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కనుక మీరు కూడా జాగ్రత్తగా ఉండండి.. రోడ్డు పక్కనే ఉన్న కరెంటు పోల్స్‌ను గమనిస్తూ నడిస్తే.. కరెంట్ షాక్ బారిన పడకుండా తప్పించుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news